Shocking Video : అండర్‌-19 ప్రపంచకప్‌ మ్యాచ్‌ మధ్యలో భూకంపం.. ఏమైందో చూడండి..!

క్వీన్స్ పార్క్ ఓవల్‌ వేదికగా ICC పురుషుల అండర్-19 (U-19) ప్రపంచకప్ మ్యాచ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

U 19 Wc Game Tremors Felt D

U-19 WC Game : క్వీన్స్ పార్క్ ఓవల్‌ వేదికగా ICC పురుషుల అండర్-19 (U-19) ప్రపంచకప్ మ్యాచ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ ఐర్లాండ్-జింబాబ్వే మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.2గా నమోదైంది. మైదానంలో భూప్రకపంనలతో కొద్దిసేపు ఆట నిలిచిపోయింది. జింబాబ్వే ఆరో ఓవర్ నడుస్తుండగా ఉన్నట్లుండి మైదానంలోని కెమెరాలు వణికాయి.

కామెంటరీ బాక్సు కూడా కుదుపులకు లోనైంది. దాదాపు భూకపం ప్రభావం సుమారు 20 సెకన్ల పాటు కనిపించింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ తీరంలో 5.2 తీవ్రతతో భూకంపం రావడంతో మ్యాచ్‌లో ప్రకంపనలు వచ్చాయి. ప్రకంపనలు ఆటపై పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ, కామెంటర్లు లైవ్ టెలిక్యాస్ట్ సమయంలో ఎదురైన చిన్నపాటి అంతరాయం ఏర్పడినట్టు వివరించారు.

ఐర్లాండ్ స్పిన్నర్ మాథ్యూ హంఫ్రీస్ ఆరో ఓవర్‌లోని ఐదవ బౌల్‌ను జింబాబ్వే బ్యాటర్ బ్రియాన్ బెన్నెట్‌కి ఔట్ చేస్తున్నప్పుడు ఫ్రంట్-ఆన్ కెమెరా ఒక్కసారిగా వణికిపోయాయి. అయినప్పటికీ, బెన్నెట్ డిఫెన్సివ్ షాట్‌ను మిడ్-ఆఫ్‌కి ఆడటంతో ఆట ఆగలేదు.. ICC కామెంటర్ ఆండ్రూ లియోనార్డ్.. (నవ్వుతూ).. కెమెరాలు కదిలిన వెంటనే ఇలా అన్నాడు.. మా వెనకాల రైలు వెళ్తున్న దానికంటే ఎక్కువ ప్రకంపనలే వచ్చాయి. మైదానంలోని మీడియా సెంటర్ వణికింది క్వీన్స్ పార్క్ ఓవల్ మీడియా సెంటర్ మొత్తం కదిలినట్లు అనిపించిందని ఆండ్రూ చెప్పుకొచ్చాడు. కాసేపటికి మైదానంలో తేరుకున్న ఆటగాళ్లు మళ్లీ ఆటలో మునిగిపోయారు.


అంతకుముందు, పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే నెమ్మదిగా ఆరంభించింది. మాథ్యూ వెల్చ్ తొమ్మిది బంతుల్లో డకౌట్‌కి రనౌట్ అయ్యాడు. కెప్టెన్ ఇమ్మాన్యుయెల్ బావా 4 పరుగుల వద్ద మాథ్యూ హంఫ్రీస్ చేతిలో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

జాక్ డిక్సన్, టిమ్ టెక్టర్ 159 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముజామిల్ షెర్జాద్ ఐదు వికెట్లు పడగొట్టాడు, స్టీవెన్ సాల్ (24), బ్రియాన్ బెన్నెట్ (37) మూడో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా, హంఫ్రీ చేతిలో సౌల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఎనిమిది ఓవర్ల తర్వాత షెర్జాద్ బాధితుల్లో బెన్నెట్ మొదటి స్థానంలో నిలిచాడు. డేవిడ్ బెన్నెట్ 35 పరుగులలో మూడు బౌండరీలు దాటించాడు. జింబాబ్వే చివరికి 48.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. ఐర్లాండ్ సునాయాసంగా జింబాబ్వేను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి ప్లేట్ ఫైనల్‌కు చేరుకుంది.

Read Also :  Uttar Pradesh Election 2022 : యూపీలో వర్చువల్‌గా మోదీ ప్రచారం.. నామినేషన్ వేయనున్న అఖిలేష్