Gongadi Trisha : నాన్న లేకుండా ఈరోజు ఇలా ఉండే దాన్నే కాదు, అమ్మాయిలకు నేను ఇచ్చే మేసేజ్ ఇదే- గొంగడి త్రిష
నాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. నా ఎదుగుదలకు ప్రభుత్వం, హెచ్ సీఏ బాగా సపోర్ట్ చేశాయి.

Gongadi Trisha : అండర్ 19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో భారత్ ఘన విజయంలో తెలంగాణ క్రికెటర్ గొంగడి త్రిష కీలక పాత్ర పోషించింది. తెలంగాణలో మారుమూలమైన ప్రాంతం భద్రాచలం నుంచి వచ్చిన త్రిష.. భారత్ ను గెలిపించింది. ఫైనల్ లో సౌతాఫ్రికాపై బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుతంగా రాణించి భారత్ చిరస్మరణీయమైన విజయాన్ని అందించింది.
‘వరల్డ్ కప్ గెలవడం చాలా ఆనందంగా ఉంది. నాన్న కూడా అక్కడే ఉన్నారు. అన్ని మ్యాచులు చూశారు. దానికి తోడు సెంచరీ కూడా చేశా. నా తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. ఇవాళ నేను ఇంత సాధించాను అంటే అది వారి వల్లే. అందుకే, నా సెంచరీని మా నాన్నకు అంకితం ఇచ్చాను.
నా ఫస్ట్ వరల్డ్ కప్ లో 3 పరుగుల వద్ద ఔటయ్యారు. ఈ వరల్డ్ కప్ కి వెళ్లే ముందు నాటౌట్ గా రావాలని అనుకుని వెళ్లాను. రెండున్నరేళ్ల నుంచి నేను క్రికెట్ ఆడుతున్నా. నా తల్లిదండ్రులు మోటివేట్ చేశారు. నాకు ఆరేళ్ల వయసు వచ్చాక బెటర్ కోచింగ్ కోసం హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాం. ప్రభుత్వం, హెచ్ సీఏ సపోర్ట్ చాలా బాగుంది. వాళ్లు ఇచ్చే మోటివేషన్ వల్లే మేము ఇలా ఆడగలుగుతున్నాం.
చిన్నప్పటి నుంచి నాకు మిథాలీ రాజ్ ఇన్స్పిరేషన్. నేను ఆమెను చూస్తూ పెరిగాను. మా క్యాంప్ కి వచ్చి ఆడుతుండే వారు. మెన్స్ క్రికెట్ లో విరాట్ కోహ్లి, ధోనీ అంటే ఇష్టం. స్పోర్ట్స్ ను కెరియర్ గా తీసుకోవాలంటే అమ్మాయిలు భయపడతారు. కానీ, ఇందులోకి అమ్మాయిలు రావొచ్చు. స్పోర్ట్స్ ని కెరియర్ గా ఎంచుకోవచ్చు.
Also Read : ఓర్నీ.. విరాట్ కోహ్లీని ఔట్ చేయడం ఇంతఈజీనా.. బస్సు డ్రైవర్ తనకు సూచనలు చేశాడన్న బౌలర్ హిమన్షు సంఘ్వాన్
ఇందులో మంచి లైఫ్ ఉంది. బాగా హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ గ్యారెంటీ. నా తల్లిదండ్రులు ఇచ్చిన మద్దతును మరిచిపోలేను. నాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. నా ఎదుగుదలకు ప్రభుత్వం, హెచ్ సీఏ బాగా సపోర్ట్ చేశాయి. ప్రతి అమ్మాయి చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలి.