Unmukt Chand : క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ సంచలన నిర్ణయం.. 28ఏళ్లకే రిటైర్మెంట్..!
9 ఏళ్లుగా టీమిండియాలో చోటు కోసం ఎదురుచూసిన ఉన్ముక్త్ చంద్ 28ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. అతడు స్పందిస్తూ.. భారత్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం బాధగా అనిపించింది. భారత్ క్రికెట్‌కు ఇకపై ప్రాతినిధ్యం వహించలేననే విషయం ఒక నిమిషం నా గుండెను ఆపేసింది. విదేశీ లీగ్‌ల్లో ఆడాలనే కోరికతో ఈ నిర్ణయం తీసుకున్నా. ఇంతకాలం నాకు మద్దతుగా నిలిచిన భారత క్రికెట్ అభిమానులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా’ అంటూ ముగించాడు.

Unmukt Chand Retires From Indian Cricket At The Age Of 28 (1)
Unmukt Chand retires from Indian cricket : భారత యువ క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ టీమిండియాకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 9 ఏళ్లుగా టీమిండియాలో చోటు కోసం ఎదురుచూసిన ఉన్ముక్త్ చంద్ చివరికి భారత క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించాడు. ఈ మేరకు ఉన్మక్త్ ట్విటర్ వేదికగా బీసీసీఐకి సుధీర్ఘ నోట్ రాశాడు. టీమిండియాకి రిటైర్మెంట్ ప్రకటించి యూఎస్ తరుపున క్రికెట్ ఆడాలని నిర్ణయం తీసుకున్నాడు. భారత ఫస్ట్‌క్లాస్ క్రికెటర్‌గా ఉన్ముక్త్ 2012 అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా కెప్టెన్‌గా ఉన్ముక్త్ చంద్ 111 పరుగులు నాటౌట్ గా నిలిచి సెంచరీతో భారత్‌కు కప్ అందించిన ఘనతను సొంతం చేసుకున్నాడు. కానీ, అతడికి టీమిండియా జట్టులో మాత్రం చోటు దక్కలేదు.
ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేక వెనుకబడి దేశవాళీ క్రికెట్ కే పరిమితమయ్యాడు. చివరికి 28ఏళ్ల వయస్సులోనే భారత క్రికెట్ జట్టు నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. తన రిటైర్మెంట్‌పై ఉన్ముక్త్ చంద్ ఇలా రాసుకొచ్చాడు.. భారత్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం కొంచెం బాధగా అనిపించింది. భారత్ క్రికెట్‌కు ఇకపై ప్రాతినిధ్యం వహించలేననే విషయం ఒక నిమిషం నా గుండెను ఆపేసింది. విదేశీ లీగ్‌ల్లో ఆడాలనే కోరికతో ఈ నిర్ణయం తీసుకున్నా. ఇంతకాలం నాకు మద్దతుగా నిలిచిన భారత క్రికెట్ అభిమానులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానంటూ ముగించాడు.
Cricket World Cup Team Member: టీమిండియా వరల్డ్ కప్ విన్నింగ్స్ టీం క్రికెటర్ రోజుకూలీగా..
ఉన్ముక్త్ చంద్.. తన క్రికెట్ కెరీర్‌లో 65 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 3379 పరుగులు సాధించాడు. 120 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 4505 పరుగులు చేశాడు. టీ20 క్రికెట్‌లో 77 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి చంద్ 1565 పరుగులు నమోదు చేశాడు. ఐపీఎల్‌లోనూ ఉన్మక్త్ చంద్ 21 మ్యాచ్‌ల్లో 300 పరుగులు సాధించి తనదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఢిల్లీ తరఫున దేశవాళీ క్రికెట్‌లోనూ దాదాపు 8 సీజన్లు ఉన్ముక్త్ చంద్ ఆడాడు. ఆ టీమ్‌కి కెప్టెన్‌గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. కానీ.. 2017 విజయ్ హజారే ట్రోఫీకి ముందు అతనిపై వేటు పడింది. 2019లో అతను ఉత్తరాఖండ్ టీమ్‌కి మారాల్సి వచ్చింది.
T1- On to the next innings of my life #JaiHind?? pic.twitter.com/fEEJ9xOdlt
— Unmukt Chand (@UnmuktChand9) August 13, 2021
మనసు మార్చుకున్న చంద్ ఢిల్లీ టీమ్‌కి తిరిగి వచ్చేశాడు. 2020-21 సీజన్‌లో ఢిల్లీ తుది జట్టులో చోటు దక్కలేదు. 2011 నుంచి ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ టీమ్‌కి ఉన్ముక్త్ చంద్ ప్రాతినిథ్యం వహించాడు. ఒకవేళ ప్రైవేట్ టీ20 లీగ్స్‌లో ఆడినట్టయితే.. ఐపీఎల్‌లోనూ ఆడేందుకు బీసీసీఐ అనుమతించదు. 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 2014 టీ20 వరల్డ్‌కప్‌కి ఎంపిక అయిన 30 మంది ప్రాబబుల్స్‌లో ఉన్ముక్త్‌కి చోటు దక్కింది. అయినప్పటికీ భారత్ తుది జట్టులో అతడికి చోటు దక్కలేదు. 28 ఏళ్ల వయస్సులోనే ఈ ఢిల్లీ క్రికెటర్ కెరీర్ అంతర్జాతీయ మ్యాచ్ ఆడకుండానే ముగిసింది.