Wimbledon : వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేతగా వొండ్రుసోవా
వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేతగా అన్‌సీడెడ్, చెక్ రిపబ్లిక్ ప్లేయర్ మర్కెటా వొండ్రుసోవా(Marketa Vondrousova) నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టునీషియాకు చెందిన ఆన్స్ జాబెర్(Jabeur) ను వరుస సెట్లలో ఓడించింది.

Marketa Vondrousova
Marketa Vondrousova wins Wimbledon title : వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేతగా అన్‌సీడెడ్, చెక్ రిపబ్లిక్ ప్లేయర్ మర్కెటా వొండ్రుసోవా(Marketa Vondrousova) నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టునీషియాకు చెందిన ఆన్స్ జాబెర్(Jabeur) ను వరుస సెట్లలో ఓడించింది. 6-4, 6-4 పాయింట్లతో గెలుపొందింది. మర్కెటా వొండ్రుసోవాకు కెరీర్‌లో ఇదే తొలి గ్రాండ్ స్లామ్ టైటిట్ కాగా.. వింబుల్డన్ చరిత్రలో 60 ఏళ్ల తర్వాత ఛాంపియన్‌గా అవతరించిన తొలి అన్‌సీడెడ్ క్రీడాకారిణిగా రికార్డులకు ఎక్కింది.
Rohit Sharma : అతడి కోసం ఇన్నింగ్స్ డిక్లేర్ ఆలస్యం.. ఇంతకీ ఎవరా ప్లేయర్ అంటే..?
వరుసగా రెండో సారి ఫైనల్‌కు చేరిన 28 ఏళ్ల ఆన్స్ జాబెర్ ఈ సారి కూడా రన్నరప్ ట్రోఫీతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వరుసగా రెండో సారి ఫైనల్ వచ్చిన జాబెర్ పై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే.. మ్యాచ్ ఆరంభం నుంచి జాబెర్ తడబడింది. తొలి సెట్‌లో ఏ మాత్రం పోటీని ఇవ్వలేకపోయింది. రెండో సెట్‌లో కాస్త పోరాడినప్పటికి పాయింట్లు రాబట్టడంలో విఫలమైంది.
Marketa’s magical moment ?
Marketa Vondrousova becomes the third Czech woman to win the ladies’ singles title, defeating Ons Jabeur 6-4, 6-4#Wimbledon pic.twitter.com/AAHThI1ZYn
— Wimbledon (@Wimbledon) July 15, 2023
ఇక ఈ ఏడాది జాబెర్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందిన వొండ్రుసోవా తాజాగా ఫైనల్లో ఓడించి విజేతగా నిలిచింది. దీంతో 23 లక్షల 50 వేల పౌండ్లు ప్రైజ్‌మనీని అందుకుంది. ఇక రన్నరప్ గా జాబెర్ 11 లక్షల 75 వేల పౌండ్లు దక్కాయి.
Sharing the moment ? #Wimbledon pic.twitter.com/DzQSuY847z
— Wimbledon (@Wimbledon) July 15, 2023