Vaibhav Suryavanshi : బ్యాటర్ గా విఫలం, కెప్టెన్‌గా చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
అండర్-19 వన్డే చరిత్రలో అతి పిన్న వయస్కుడైన కెప్టెన్ గా వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) చరిత్ర సృష్టించాడు.
Vaibhav Suryavanshi Breaks Pakistan Star Ahmed Shehzad 19 Year Old World Record (pic credit ACC x)
- భారత్ అండర్-19, సౌతాఫ్రికా అండర్-19 మధ్య తొలి వన్డే
- అండర్-19 వన్డే చరిత్రలో అతి పిన్న వయస్కుడైన కెప్టెన్ గా సూర్యవంశీ
- బ్యాటర్‌గా విఫలం
Vaibhav Suryavanshi : గత కొన్నాళ్లుగా టీమ్ఇండియా క్రికెట్ వర్గాల్లో వినిపిస్తున్న పేరు వైభవ్ సూర్యవంశీ. 14 ఏళ్ల ఈ యువ ఆటగాడు విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో అలరిస్తున్నాడు. ఇక భారీ అంచనాలతో సౌతాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన ఈ చిచ్చర పిడుగు కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లోనే నిరాశపరిచాడు.
భారత-19 జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో భాగంగా సౌతాఫ్రికా అండర్-19 జట్టుతో మూడు యూత్ వన్డేలు ఆడనుంది. రెగ్యులర్ కెప్టెన్ ఆయుశ్ మాత్రే ఈ సిరీస్‌కు దూరం కాగా వైభవ్ సూర్యవంశీ తాత్కాలిక సారథిగా ఎంపిక అయ్యాడు.
KKR : బీసీసీఐ ఆదేశాలపై స్పందించిన కేకేఆర్.. మేము అతడిని వదిలివేస్తున్నాం..
శనివారం భారత్-19, సౌతాఫ్రికా అండర్-19 జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ ప్రారంభైంది. టాస్ ఓడిన భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్‌లో సూర్య వంశీ విఫలం అయ్యాడు. 12 బంతులు ఎదుర్కొని 2 ఫోర్ల సాయంతో 11 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
కెప్టెన్‌గా చరిత్ర..
14 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ ఏ స్థాయిలోనైనా జాతీయ జట్టుకు నాయకత్వం వహించిన తొలి ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. 16 ఏళ్ల వయసులోపు అంతర్జాతీయ అండర్ -19 జట్టుకు నాయకత్వం వహించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు పాకిస్తాన్ ఆటగాడు అహ్మద్ షెహజాద్ పేరిట ఉండేది. షెహజాద్ 15 ఏళ్ల 141 రోజుల వయసులో పాక్ అండర్ -19 జట్టుకు నాయకత్వం వహించాడు. ఇక సూర్యవంశీ 14 ఏళ్ల 282 రోజుల వయసులో భారత అండర్-19 జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు.
Hardik Pandya : శతకంతో చెలరేగిన హార్దిక్ పాండ్యా.. లిస్ట్-ఏ క్రికెట్‌లో తొలి సెంచరీ
అండర్-19 వన్డే చరిత్రలో అతి పిన్న వయస్కులైన కెప్టెన్లు వీరే..
* వైభవ్ సూర్యవంశీ (భారత్) – 14 ఏళ్ల 282 రోజులు
* అహ్మద్ షెహజాద్ (పాకిస్తాన్) – 15 ఏళ్ల 141 రోజులు
* మెహిదీ హసన్ మిరాజ్ (బంగ్లాదేశ్) – 15 ఏళ్ల 284 రోజులు
