Vijay Deverakonda-Tilak Varma : తిలక్‌వర్మతో హీరో విజయ్ దేవరకొండ ఛాలెంజ్.. నువ్వు నన్ను ఓడిస్తే ముంబై జెర్సీ వేసుకుంటా.. ఫలితం ఏంటంటే..
తెలుగు ఆటగాడు తిలక్ వర్మతో హీరో విజయ్ దేవరకొండ ఛాలెంజ్ చేశాడు.

Vijay Deverakonda Vows To Wear MI Jersey If Tilak Varma Could Beat Him In Pickleball
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆలస్యంగా పుంజుకున్న ముంబై ఇండియన్స్ తనదైన ఆటతో అదరగొడుతోంది. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి బలంగా దూసుకువచ్చింది. ఇప్పటి వరకు ముంబై 11 మ్యాచ్‌లు ఆడింది. 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 14 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉండగా నెట్‌రన్‌రేట్ +1.274గా ఉంది.
లీగ్ దశలో ముంబై మరో మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో కనీసం రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించినా కూడా ముంబై ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. ఈ క్రమంలో మంగళవారం వాంఖడే స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.
🍿𝗖𝗛𝗔𝗟𝗟𝗘𝗡𝗚𝗘 🤝 𝘼𝘾𝘾𝙀𝙋𝙏𝙀𝘿 😂#MumbaiIndians #PlayLikeMumbai | @TilakV9 @TheDeverakonda pic.twitter.com/y80ZqGbJzo
— Mumbai Indians (@mipaltan) May 5, 2025
కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు తెలుగు ఆటగాడు, ముంబై కీలక ప్లేయర్ తిలక్ వర్మతో కలిసి హీరో విజయ్ దేవరకొండ సరదాగా పికిల్ బాల్ ఆడాడు.
ఈ క్రమంలో బెస్ట్ ఆఫ్ త్రీలో తనను ఓడిస్తే ముంబై ఇండియన్స్ జెర్సీ వేసుకుంటానని తిలక్ వర్మతో విజయ్ దేవరకొండ ఛాలెంజ్ చేశాడు. అయితే.. చివరికి 2-1తో విజయ్ దేవరకొండ జట్టు విజయం సాధించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్‌కు మరింత చేరువ కావాలని ఇటు ముంబై, అటు గుజరాత్ లు ఆరాటపడుతున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై మూడో స్థానంలో ఉండగా.. గుజరాత్ నాలుగో స్థానంలో ఉంది. గుజరాత్ ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడగా 7 మ్యాచ్‌ల్లో గెలిచింది. 14 పాయింట్లు జట్టు ఖాతాలో ఉండగా నెట్‌రన్‌రేట్ +0.867గా ఉంది.