SRH : అధికారికంగా ప్లేఆఫ్స్ నుంచి సన్‌రైజర్స్ ఔట్.. కేకేఆర్, ఆర్‌సీబీ, లక్నోలకు కొత్త టెన్షన్..!
ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసింది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసింది. ఆ జట్టు అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించింది. గతేడాది రన్నరప్‌గా నిలిచినా.. ఈ ఏడాది గ్రూప్ స్టేజీకే పరిమితమైంది. వర్షం కారణంగా సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్ రద్దు కావడంతో సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు అయ్యాయి. ఎలాంటి ఆటంకం లేకుండా సగం మ్యాచ్ పూర్తి అయినా.. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ వర్షార్పణమైంది. ఇరు జట్లకు ఒక్కొ పాయింట్‌ను కేటాయించారు.
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ లీగ్ దశలో మరో మూడు మ్యాచ్‌లు మే 10న కోల్‌కతా నైట్‌రైడర్స్, మే 13న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మే 18న లక్నో సూపర్ జెయింట్స్ తో ఆడనుంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసుకు దూరం కావడంతో ఈ మూడు మ్యాచ్‌ల్లో ఎస్ఆర్‌హెచ్ ఆటగాళ్లు ఎంతో స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంది.
Digvesh Rathi : దిగ్వేష్ మళ్లీ నోట్‌బుక్ సంబరాలు.. ఈ సారి ఏమవుతుందో?
ఈ మూడు మ్యాచ్‌ల్లో గెలిచి అభిమానులకు కాస్త ఊరట నివ్వాలని ఎస్ఆర్‌హెచ్ భావిస్తోంది. అదే సమయంలో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8 స్థానంలో ఉండగా.. దాన్ని మెరుగుపరచుకోవాలని ఆరాటపడుతోంది. దీంతో కేకేఆర్, ఆర్‌సీబీ, లక్నోలకు కొత్త టెన్షన్ మొదలైంది.
కోల్‌కతా నైట్‌రైడర్స్..
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడింది. 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, మరో 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. 11 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉన్నాయి. నెట్‌రన్‌రేట్ +0.249గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. లీగ్ దశలో కేకేఆర్ మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే.. అప్పుడు ఆ జట్టు 17 పాయింట్లతో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టవచ్చు.
అయితే కేకేఆర్ ఆడనున్న తదుపరి మూడు మ్యాచ్‌ల్లో.. ఓ మ్యాచ్ సన్‌రైజర్స్‌తోనే ఆడనుంది. ఒకవేళ ఎస్ఆర్‌హెచ్ చేతిలో ఓడిపోతే.. ప్రస్తుత పరిస్థితుల్లో కేకేఆర్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించడం దాదాపుగా ఖాయం.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
ఇప్పటి వరకు ఆర్‌సీబీ 11 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల్లోనే ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో 16 పాయింట్లు ఉండగా నెట్‌రన్‌రేట్ +0.482గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. లీగ్ దశలో మరో మూడు మ్యాచ్‌లు ఆర్‌సీబీ ఆడనుంది. ఇందులో కనీసం ఒక్క మ్యాచ్‌లో గెలిచినా కూడా ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌లో అడుగుపెడుతుంది.
అయితే టాప్-2లో నిలిచి ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టే జట్లకు కాస్త అడ్వాండేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఫైనల్ చేరుకునేందుకు టాప్-2 జట్లకు రెండు అవకాశాలు ఉంటాయి. అదే 3,4వ స్థానాల్లో నిలిచి ప్లేఆఫ్స్ చేరుకునే జట్లకు ప్రతి మ్యాచ్ డూఆర్‌డై లాంటిది. పంజాబ్, ముంబై, గుజరాత్‌లు దూసుకువస్తుండడంతో.. టాప్-2లో నిలవాలంటే సన్‌రైజర్స్‌తో మ్యాచ్ కూడా ఆర్‌సీబీకి ఎంతో ముఖ్యం కానుంది.
లక్నో సూపర్ జెయింట్స్..
ఇప్పటి వరకు లక్నో 11 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా మరో 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో 10 పాయింట్లు ఉన్నాయి. నెట్‌రన్‌రేట్ -0.469గా ఉంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఏడో స్థానంలో ఉంది. లీగ్ దశలో లక్నో మరో మూడు మ్యాచ్‌లు ఆడనుంది.
Viral Video : అదేం గుండెరా బాబు.. జేబులోనే పెట్టుకొని వచ్చాడుగా.. పరిగెడుతుండగా జారిపడింది..
ఈ మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే.. అప్పుడు ఆ జట్టు ఖాతాలో 16 పాయింట్లు వచ్చి చేరుతాయి. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది. కాగా.. లక్నో ఆడనున్న మూడు మ్యాచ్‌ల్లో ఓ మ్యాచ్ సన్‌రైజర్స్‌తో ఆడనుంది. ఒకవేళ ఎస్ఆర్‌హెచ్ చేతిలో ఓడిపోతే లక్నో ప్లేఆఫ్స్ అవకాశాలు దెబ్బతింటాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు దూరం అయింది. అయినప్పటికి కేకేఆర్, లక్నో జట్ల ప్లేఆఫ్స్ అవకాశాలను ఎస్ఆర్‌హెచ్ ప్రభావితం చేయొచ్చు. దీంతో ఇప్పుడు కేకేఆర్, లక్నోలతో పాటు ఆర్‌సీబీకి సన్‌రైజర్స్ టెన్షన్ పట్టుకుంది.