IPL 2024 : నో బాల్ విషయంలో అంపైర్‌తో కోహ్లీ గొడవ.. మ్యాచ్ తరువాత ఏం జరిగిందంటే..? వీడియో వైరల్

మూడో ఓవర్లో విరాట్ కోహ్లీ ఔట్ కావడంతో పెద్ద వివాదం రేగింది. కేకేఆర్ బౌలర్ హర్షిత్ రాణా బౌలింగ్ చేస్తున్నాడు. ఓవర్ తొలి బంతికే ఫుల్ టాస్ బౌల్ చేశాడు. కోహ్లీ బ్యాట్ కు తగలడంతో ..

IPL 2024 : నో బాల్ విషయంలో అంపైర్‌తో కోహ్లీ గొడవ.. మ్యాచ్ తరువాత ఏం జరిగిందంటే..? వీడియో వైరల్

Virat kohli

Virat kohli : ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఔట్ వివాదంగా మారింది. నోబాల్ విషయంలో అంపైర్ తో కోహ్లీ వాగ్వివాదానికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు 222 పరుగులు భారీ స్కోర్ చేసింది. 223 పరుగుల లక్ష్యంతో క్రీజులోకి వచ్చిన కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు.

Also Read : IPL 2024 : చెలరేగిన రాహుల్ తెవాతియా.. పంజాబ్‌పై 3 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం

మూడో ఓవర్లో విరాట్ కోహ్లీ ఔట్ కావడంతో పెద్ద వివాదం రేగింది. కేకేఆర్ బౌలర్ హర్షిత్ రాణా బౌలింగ్ చేస్తున్నాడు. ఓవర్ తొలి బంతికే ఫుల్ టాస్ బౌల్ చేశాడు. కోహ్లీ బ్యాట్ కు తగలడంతో బంతి గాలిలోకి దూసుకెళ్లింది. హర్షిత్ క్యాచ్ తీసుకున్నాడు. అయితే, అది నో బాల్ అని భావించిన కోహ్లీ వెంటనే డీఆర్ఎస్ కోరాడు. కానీ థర్డ్ అంపైర్ రీప్లేలో చూసిన తరువాత కోహ్లీ క్రీజు బయట ఉన్నాడని, బంతి నడుం కంటే తక్కువ ఎత్తులోనే వచ్చిందని ఔటిచ్చాడు. నేలపై నుంచి కోహ్లీ నడుం ఎత్తు 1.04 మీటర్లు కాగా.. అతను ఆడినప్పుడు బంతి 0.92 మీటర్ల ఎత్తులోనే ఉందని సాంకేతిక సాయంతో అంపైర్ నిర్ణయించాడు.

Also Read : Rohit Sharma : రోహిత్ శ‌ర్మ చెప్పాక చేసేదేముంది..! ఇంపాక్ట్ ప్లేయ‌ర్ రూల్‌లో మార్పుల‌కు బీసీసీఐ క‌స‌ర‌త్తులు..?

అంపైర్ల నిర్ణయంతో కోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పెవిలియన్ వైపు వెళ్తూ మళ్లీ వచ్చి అంపైర్లతో వాదించాడు. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూంలోకి వెళ్తున్న కోహ్లీని పిలిచిన అంపైర్ నోబాల్ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. వారి మధ్య సుదీర్ఘ సంభాషణ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.