T20 World Cup 2021: ఇవన్నీ వెన్నెముక లేని వెధవల కామెంట్లు – విరాట్ కోహ్లీ

టీ0 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా జరిగిన భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఓటమి అంతటినీ షమీ మీదకు డైవర్ట్ చేశారు నెటిజన్లు. సోషల్ మీడియాలో చెత్త కామెంట్లతో పర్సనల్ అకౌంట్ ఫుల్ అయింది.

T20 World Cup 2021: ఇవన్నీ వెన్నెముక లేని వెధవల కామెంట్లు – విరాట్ కోహ్లీ

Team India

Updated On : October 30, 2021 / 8:33 PM IST

T20 World Cup 2021: టీ0 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా జరిగిన భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఓటమి అంతటినీ షమీ మీదకు డైవర్ట్ చేశారు నెటిజన్లు. సోషల్ మీడియాలో చెత్త కామెంట్లతో పర్సనల్ అకౌంట్ ఫుల్ అయిపోయింది. దీనిపై గతంలో స్పందించిన కోహ్లీ మరోసారి స్పందించాడు. శనివారం మీడియా కాన్ఫిరెన్స్ లో భాగంగా మాట్లాడిన కోహ్లీ వెన్నెముక లేని వెధవలే ఇటువంటి కామెంట్లు చేస్తారని తిట్టిపోశాడు.

ఓ స్టార్ ప్లేయర్‌ను మతం పేరిట దూషించడం అమానుషమని, ఇలాంటి పిచ్చి కూతలకు సోషల్ మీడియా వేదిక కావడం బాధాకరంగా ఉందన్నాడు కోహ్లీ. మహమ్మద్ షమీకి జట్టు మొత్తం అండగా ఉందని, తదుపరి మ్యాచ్‌లో 200 పర్సెంట్ ఆడతాడని స్పష్టం చేశాడు.

‘అత్యున్నత వేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించాలని భారత జట్టులో ప్రతి ఒక్కరూ గెలవడం కోసమే ఆడుతుంటారు. అంతేకానీ వెన్నెముక లేని వెదవలను అలరించడానికి కాదు. మనిషికి ఎదురుపడి మాట్లాడే ధైర్యం లేని వాళ్లే, సోషల్ మీడియాలో చెత్త కామెంట్లన్నీ పోస్టు చేస్తుంటారు. ఎగతాళి చేయడానికి, ఎమోషన్స్‌తో ఆడుకోవడానికి సోషల్ మీడియా వేదిక కావడం చూస్తుంటే బాధగా ఉంది.

………………………………… : నవంబర్ 01వ తేదీ..మారనున్న రూల్స్

ప్లేయర్ మతాన్ని అడ్డుపెట్టుకుని, అతనిపై దాడి చేయడం దారుణం. జట్టులో ప్రతి ప్లేయర్‌ను అర్థం చేసుకుంటాం. మా బలం అదే. సోషల్ మీడియా వేదికగా ఎవరినో ఒకరిని కించపరుస్తున్న వెన్నెముక లేని వెదవల్లా కాకుండా మా కంటూ ఓ క్యారెక్టర్ ఉండటం వల్లే మేమంతా దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాం. ఇటువంటి వెదవలను పట్టించుకోకపోవడమే మంచిది.

‘భారత్ మరో మ్యాచ్‌ ఓటమిని ప్రజలు సమ్మతిస్తారా.. లేదా అనేది అనవసరం. బయటి విషయాలతో మాకు సంబంధం లేదు. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకే 100 శాతం ప్రయత్నిస్తాం’అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

షమీ ముస్లిం కాబట్టి.. ముస్లిం దేశమైన పాక్ విజయానికి పరోక్షంగా సహకరించాడంటూ.. కెపాసిటీ మొత్తాన్ని ఉపయోగించి ఆడలేదంటూ ఆరోపిస్తూ పాకిస్థాన్ వెళ్లిపోవాలని ట్రోలింగ్ చేశారు నెటిజన్లు.