Virat Kohli: రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ.. ఏ భారత క్రికెటరూ సాధించలేని ఫీట్..

ఐపీఎల్‌ 2025లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ముంబైలో మ్యాచ్ జరిగింది.

Pic: @RCBTweets

టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్‌లో 13 వేల రన్స్‌ బాదిన తొలి భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. మొత్తం 386 ఇన్నింగ్సుల్లో అతడు ఈ పరుగులు బాదాడు. ఐపీఎల్‌ 2025లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ముంబైలో మ్యాచ్ జరిగింది.

ఇందులో విరాట్‌ కోహ్లీ కోహ్లీ 67 పరుగులు బాదాడు. టీ20ల్లో ఇంతకుముందు 13 వేల రన్స్‌ బాదిన బ్యాటర్లుగా క్రిస్ గేల్ (381 ఇన్నింగ్స్‌ల్లో 14562 రన్స్), అలెక్స్ హేల్స్ (474 ఇన్నింగ్స్‌ల్లో 13610 రన్స్), షోయబ్ మాలిక్ (487 ఇన్నింగ్స్‌ల్లో 13557 రన్స్‌) పొలార్డ్ (594 ఇన్నింగ్స్‌ల్లో 13537 రన్స్) ఉన్నారు.

నేటి మ్యాచులో ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ బ్యారట్లలో ఫిలిప్ సాల్ట్ 4, కోహ్లీ 67, పడిక్కల్ 37, రజత్ పటీదార్ 64, లివింగ్ స్టోన్ 0, జితేశ్ శర్మ 40 (నాటౌట్), టిమ్ డేవిడ్ 1 (నాటౌట్) పరుగులు తీశారు. దీంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 221/5 పరుగులు బాదింది.

ముంబై బౌలర్లలో బౌల్ట్, హార్దిక్ పాండ్యాకు రెండేసి వికెట్లు, విఘ్నేశ్‌కు ఒక వికెట్ దక్కింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్

ముంబై ఇండియన్స్ జట్టు: ప్లేయింగ్ విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, విఘ్నేశ్ పుత్తూర్