Virat Kohli : సచిన్, ద్రవిడ్‌ల రికార్డులు బ్రేక్.. అజారుద్దీన్ రికార్డును సమం చేసిన కోహ్లీ..
వన్డేల్లో ఫీల్డర్‌గా కోహ్లీ అరుదైన రికార్డును సాధించాడు.

Virat Kohli equalls Mohammad Azharuddin record as a Most catches as fielder for India in ODIs
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ వన్డేల్లో అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు (ఫీల్డర్) అందుకున్న భారత ఆటగాడి రికార్డును సమం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అతడు జాకీర్ అలీ క్యాచ్ అందుకున్న క్రమంలో ఈ ఘనత సాధించాడు.
వన్డేల్లో కోహ్లీకి ఇది 156 క్యాచ్ కాగా.. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ సైతం ఇన్నే క్యాచ్‌లు అందుకున్నాడు. కాగా.. అజారుద్దీన్ 334 వన్డేల్లో ఈ ఘనత సాధించగా 298 మ్యాచ్‌ల్లో దీన్ని సాధించాడు. వీరిద్దరి తరువాత సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ లు ఉన్నారు.
వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న భారత ఫీల్డర్లు వీరే..
మహ్మద్ అజారుద్దీన్ – 156 క్యాచ్‌లు
విరాట్ కోహ్లీ -156 క్యాచ్‌లు
సచిన్ టెండూల్కర్ – 140 క్యాచ్‌లు
రాహుల్ ద్రవిడ్ – 124 క్యాచ్‌లు
సురేశ్ రైనా – 102 క్యాచ్‌లు