Virat Kohli : విరాట్ కోహ్లీ షాకింగ్ కామెంట్స్.. ఆ టైటిలే నా లక్ష్యం.. అభిమానుల్లో ఉత్కంఠ!
Virat Kohli 2027 World Cup : భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Virat Kohli
Virat Kohli 2027 World Cup : భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 2027 వన్డే ప్రపంచకప్‌నే తన చివరి ప్రపంచకప్‌గా భావిస్తున్నట్లు కింగ్ కోహ్లీ వెల్లడించాడు. భారత్‌కు ప్రపంచకప్ అందించడమే తన ప్రధాన లక్ష్యమని, అందుకోసం పూర్తి శక్తితో ఆడతానని చెప్పాడు.
ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఆదివారం తొలి వన్డే మ్యాచ్ మధ్యాహ్నం 2గంటలకు తిరువనంతపురం వేదికగా ప్రారంభం కానుంది. అయితే, వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు కోహ్లీ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. ‘టీమిండియా తరఫున నేను ఆడబోయే చివరి ప్రపంచకప్ ఇదే. అదే నాకు ప్రధాన ప్రేరణ. గ్రౌండ్లో సర్వస్వం ధారపోయాలనేదే నా లక్ష్యం. కచ్చితంగా ప్రపంచకప్ గెలవడమే ధ్యేయం. దాని కోసం ఎంతటి కష్టాన్ని భరించేందుకైనా నేను సిద్ధమే. వన్డే వరల్డ్‌కప్‌లో ఉండే తీవ్రత మరే ఇతర టోర్నీలో ఉండదని’ కోహ్లి వెల్లడించాడు.
ప్రపంచకప్ క్రికెట్లో కోహ్లీకి ఇప్పటికే అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 37 వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో 1,795 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, 12 అర్ధసెంచరీలు ఉన్నాయి. ప్రపంచకప్‌లో అతని అత్యధిక స్కోరు 117 పరుగులు. ప్రస్తుతం కోహ్లీ భారత్ తరఫున వన్డే ఫార్మాట్లో కొనసాగుతున్నాడు. అతని కెరీర్లో ఇప్పటివరకు 314 వన్డేలు, 14,941 పరుగులు, 54 సెంచరీలు, 79 అర్ధసెంచరీలు ఉన్నాయి.
