Virat Kohli : సచిన్ రికార్డును సమం చేసిన కోహ్లీ.. సెంచరీల రికార్డు కాదు సుమీ..
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఖాతాలో ఓ చెత్త రికార్డు వచ్చి చేరింది.

Virat Kohli-Sachin Tendulkar
Virat Kohli unwanted record : పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఖాతాలో ఓ చెత్త రికార్డు వచ్చి చేరింది. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 9 బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ ఒక్క పరుగు చేయకుండానే విల్లీ బౌలింగ్‌లో స్టోక్స్ క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు. కాగా.. ప్రపంచకప్‌లలో విరాట్ కోహ్లీకి ఇదే మొదటి డకౌట్ కావడం గమనార్హం. కాగా.. అంతర్జాతీయ క్రికెట్లో టీమ్ఇండియా తరుపున ఆడుతూ అన్ని ఫార్మాట్లలో కోహ్లీకి ఇది 34వ డకౌట్. ఈ క్రమంలో క్రికెట్ దేవుడు సచిన్ రికార్డును కోహ్లీ సమం చేశాడు.
2011 నుంచి విరాట్ కోహ్లీ వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడుతూ..ఇప్పటి వరకు ఈ ఫార్మాట్లో 32 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 2012 నుంచి టీ20 ప్రపంచకప్ మ్యాచులు ఆడుతూ.. ఈ ఫార్మాట్లో 25 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ప్రపంచకప్‌లలో మొత్తంగా 57 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ ఎనిమిది సార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం అయ్యాడు. అందులో ఆరు సార్లు వన్డే ఫార్మాట్లోనే ఉన్నాయి. ఇప్పుడు మొదటి సారి డకౌట్ అయ్యాడు. ప్రపంచకప్‌లో అతడి అత్యల్ప స్కోరు 1. మూడు సార్లు దీనిని నమోదు చేశాడు. 2011 ప్రపంచకప్‌లో నాగ్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫికా పై, 2015 ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై సిడ్నీలో, 2019 ప్రపంచ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై మాంచెస్టర్‌లో. కాగా.. ఈ మూడు సందర్భాల్లో భారత్ ఓడిపోయింది.
గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు.. కోహ్లీని ఉద్దేశించి చేసినవేనా..?
సచిన్ రికార్డు సమం..
అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లీకి ఇది 34వ డకౌట్. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా తన కెరీర్లో అంతర్జాతీయ క్రికెట్లో 34 డకౌట్లను కలిగి ఉన్నాడు. వీరిద్దరి తరువాత వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ వరుసగా 31, 30 డక్‌లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. సౌరవ్ గంగూలీ తన అంతర్జాతీయ కెరీర్లో 29 సార్లు పరుగులు చేయకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు.
Kohli gone for 0️⃣! ?
He holes out to Ben Stokes at mid-off and David Willey has our second!
?? 2️⃣7️⃣-2️⃣#EnglandCricket | #CWC23 pic.twitter.com/X2LqXocCTY
— England Cricket (@englandcricket) October 29, 2023