Shane Watson: ఇలాగైతే కొత్త బ్యాటర్లు టీమిండియాలోకి రావడం కష్టం: షేన్ వాట్సన్‌

వీరిద్దరు తమ ఫెర్మార్ఫన్స్‌తో యువ ఆటగాళ్లు జట్టులో చోటు సంపాదించుకునే యత్నాలను కష్టతరం చేస్తున్నారని తెలిపారు.

Shane Watson: ఇలాగైతే కొత్త బ్యాటర్లు టీమిండియాలోకి రావడం కష్టం: షేన్ వాట్సన్‌

Updated On : March 12, 2025 / 7:51 AM IST

టీమిండియా సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇంకా బాగానే ఆడుతున్నారని ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ అంటున్నారు. దీంతో వారి స్థానంలో యువ ఆటగాళ్లు జట్టులో చోటు సంపాదించడం కష్టతరం అవుతుందని చెప్పారు.

ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు ఇప్పటికీ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నారని, వారిని స్థానాన్ని కొత్త ఆటగాళ్లతో భర్తీ చేయడం అంత సులభం కాదని తెలిపారు.

Shane Watson

తాజాగా ఓ ఇంటర్వ్యూలో షేన్ వాట్సన్ మాట్లాడుతూ.. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్, కోహ్లీ తమ పెర్ఫార్మన్స్‌ను ఎలా మెరుగుపరుచుకున్నారో చెప్పారు.

Also Read: ‘కుడుంబస్థాన్‌’ మూవీ రివ్యూ.. ఫ్యామిలీని పోషించే మిడిల్ క్లాస్ మగాడి కష్టాలతో కామెడీ..

“నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం.. రోహిత్, కోహ్లీ ఇప్పటికీ చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నారు. విరాట్ ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడిన తీరును బట్టి అతను ఇప్పటికీ వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ ఛేజర్. కోహ్లీ ఎంత బాగా బ్యాటింగ్ చేస్తున్నాడో మనం చూశాం. రోహిత్ కూడా ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్ బౌలింగ్‌ని అద్భుతమైన ఎదుర్కొని, ఇన్నింగ్స్ అద్భుతంగా ఆడాడు” అని వాట్సన్ అన్నారు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికీ బాగానే ఆడుతున్నారని, భారత్‌ కోసం అదే ఎనర్జీతో, ఉత్సాహంతో ఆడతామన్న సందేశం ఇస్తున్నారని వాట్సన్న చెప్పారు. వీరిద్దరు తమ ఫెర్మార్ఫన్స్‌తో యువ ఆటగాళ్లు జట్టులో చోటు సంపాదించుకునే యత్నాలను కష్టతరం చేస్తున్నారని తెలిపారు.

“ఒత్తిడిలో ఎలా రాణించాలో వారిద్దరికి తెలుసు. ఈ విషయాన్ని ఛాంపియన్స్ ట్రోఫీలోనూ మనం చూవాం. టీమ్‌కి అవసరమైనప్పుడు వారు చాలా బాగా ఆడారు” అని వాట్సన్ అన్నారు. కాబట్టి, వీరిద్దరు రిటైర్మెంట్‌ ప్రకటించకుండా ఇంకా ఆడాలని అనుకుంటే భారత జట్టులోకి ప్రవేశించడానికి కొత్త వాళ్లు బాగా కష్టపడాల్సిందేనని చెప్పారు.