IPL 2025: ఆర్సీబీ అభిమానులకు గుడ్‌న్యూస్‌.. జట్టు యాజమాన్యం కీలక నిర్ణయం

ఆర్సీబీ అభిమానులకు జట్టు యాజమాన్యం శుభవార్త చెప్పింది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మళ్లీ..

IPL 2025: ఆర్సీబీ అభిమానులకు గుడ్‌న్యూస్‌.. జట్టు యాజమాన్యం కీలక నిర్ణయం

RCB Team

Updated On : October 31, 2024 / 7:15 AM IST

IPL Retention: ఐపీఎల్ సీజన్ వచ్చిదంటే చాలు క్రికెట్ ఫ్యాన్స్ కు పండుగే. ముఖ్యంగా ఆర్సీబీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) జట్టు అభిమానుల కోలాహలం వేరే రేంజ్ లో ఉంటుంది. దీనికి కారణం ఆ జట్టులో విరాట్ కోహ్లీ ఉండటమే. అయినా, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆ జట్టు టైటిల్ ను గెలుచుకోలేక పోయింది. ప్రతీయేటా ఆ జట్టు ఆటగాళ్లు ఫ్యాన్స్ ను నిరాశ పరుస్తూనే ఉన్నారు. 2013 నుంచి 2021 వరకు బెంగళూరుకు కోహ్లి సారథ్యం వహించాడు. 2016లో జట్టును ఫైనల్ కు తీసుకెళ్లగా.. తుదిపోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఆర్సీబీఓడిపోయింది. 2021 సీజన్ తరువాత కోహ్లీ కెప్టెన్సీ వదులుకున్నాడు. అతని స్థానంలో డూప్లెసిప్ కెప్టెన్ గా కొనసాగుతూ వస్తున్నాడు. అయితే, కెప్టెన్సీ పగ్గాలు కోహ్లీకే ఇవ్వాలని ఆర్సీబీ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్సీబీ యాజమాన్యం అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.

Also Read: Harshit Rana : కివీస్‌తో మూడో టెస్టుకు హ‌ర్షిత్ రాణా.. క్లారిటీ ఇచ్చిన అభిషేక్ నాయ‌ర్‌

ఆర్సీబీ అభిమానులకు జట్టు యాజమాన్యం శుభవార్త చెప్పింది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకే మళ్లీ జట్టు పగ్గాలు అప్పగించేందుకు సిద్ధమైంది. మీడియా కథనాల ప్రకారం.. 2025 సీజన్ లో ఆర్సీబీ జట్టు కోహ్లీ సారథ్యంలో బరిలోకి దిగబోతుందని తెలుస్తోంది. గతంలో కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించేందుకు కోహ్లీ నిరాసక్తత వ్యక్తం చేశాడు. ప్రస్తుతం జట్టు మేనేజ్ మెంట్, కోహ్లి మధ్య కెప్టెన్సీ విషయంపై చర్చలు జరిగినట్లు, విరాట్ జట్టుకు నాయకత్వం వహించేందుకు ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆర్సీబీ సారథిగా డూప్లెసిస్ వ్యవహరిస్తున్నాడు. అయితే, ఈ ఏడాది అతను 40వ సంవత్సరంలో అడుగు పెట్టనున్నాడు. ఈ క్రమంలో జట్టు ప్లేయర్ గా డూప్లెసిస్ ను తప్పించే యోచనలో జట్టు యాజమాన్యం ఉన్నట్లు సమాచారం.

 

ఐపీఎల్ టోర్నీలో ఏళ్ల తరబడి ఆయా జట్ల తరపున కొనసాగుతున్న ఆటగాళ్లకు ఆయా ఫ్రాంచైజీలు గుడ్ బై చెబుతున్న పరిస్థితి. మరికొందరు ప్లేయర్స్ అయితే.. వారు ఆడుతున్న జట్లను వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో శుభ్ మన్ గిల్, రిషబ్ పంత్ అందుబాటులో ఉంటే వారిని తీసుకునేందుకు ఆర్సీబీ మేనేజ్ మెంట్ గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు.. కీలక ఆటగాళ్ల కోసం ఆర్సీబీ జట్టు గట్టిగానే ప్రయత్నిస్తుందని మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. అయితే, ఎవరు వచ్చినా ఈసారి కోహ్లీనే ఆర్సీబీ జట్టుకు సారథ్యం వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోహ్లీ సారథ్యంలో ఆర్సీబీ జట్టు మైదానంలోకి దిగితే ఆ దూకుడే వేరేలా ఉంటుంది. దీంతో అదేజరిగితే ఆర్సీబీ ఫ్యాన్స్ కు పెద్ద శుభవార్త అని చెప్పొచ్చు.