Kohli
Virat kohli : ఐపీఎల్ 2021 మ్యాచ్ లు కొనసాగుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ తో రాయల్ ఛాలెంజర్ బెంగళూరు జట్లు ఢీకొననున్నాయి. దీంతో మ్యాచ్ కు సిద్ధం కావడానికి జట్లు ఆటగాళ్లు సిద్ధమౌతున్నారు. అందులో భాగంగా క్రీడాకారులు నెట్స్ విపరీతంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ…నెట్స్ లో చెమటోడుస్తున్నారు. నెత్తికి హెల్మెట్ పెట్టుకుని..విజృంభిస్తున్నాడు. కోహ్లీ నెట్ ప్రాక్టీస్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ట్విట్టర్ వేదికగా కోహ్లీ..ఈ వీడియోను పోస్టు చేశారు. గత రెండు మ్యాచ్ లలో ఇతను హాఫ్ సెంచరీలతో రాణించాడు. ప్రస్తుతం కోహ్లీకి సంబంధించిన నెట్ ప్రాక్టీస్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ రోజున సెంచరీ కొడితే చూడాలని ఉంది భాయ్ అంటూ..కామెంట్స్ చేస్తున్నారు. కోహ్లీకి మరికొంతమంది విషెస్ చెబుతున్నారు.
ఐపీఎల్ 2021 రెండో భాగంలో కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో పరాజయం చెందిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో కోహ్లీ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. దీంతో అతని ఆట తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో తన బ్యాట్ కు పని చెప్పాడు. ఏకంగా 53 పరుగులు చేసిన తనలో ఇంకా సత్తా ఉందని చాటి చెప్పాడు. ఆదివారం ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్ లో కూడా రాణించాడు. హాఫ్ సెంచరీ సాధించి..తనపై విమర్శలు చేస్తున్న వారి నోటికి తాళం వేశారు. ఇప్పటి వరకు 10 మ్యాచ్ లు ఆడి ఆరింటిలో గెలిచిన…ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మూడోస్థానంలో ఉంది. మరి రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ లో కోహ్లీ రాణిస్తాడా ? లేదా ? అనేది చూడాలి.
— Virat Kohli (@imVkohli) September 28, 2021