Virat Kohli : లుంగీ డ్యాన్స్ పాట‌కు విరాట్ కోహ్లీ స్టెప్పులు.. వీడియో వైర‌ల్‌

ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ (Virat Kohli ) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. త‌న ఆట‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

Virat Kohli : లుంగీ డ్యాన్స్ పాట‌కు విరాట్ కోహ్లీ స్టెప్పులు.. వీడియో వైర‌ల్‌

Virat Kohli Lungi Dance

Virat Kohli Lungi Dance : ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ (Virat Kohli ) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. త‌న ఆట‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. బ్యాటింగ్ చేసే స‌మ‌యంలోనైనా, ఫీల్డింగ్ చేసేట‌ప్పుడు అయినా స‌రే విరాట్ మైదానంలో దూకుగా ఉంటాడు అన్న సంగ‌తి తెలిసిందే. ఇక ఆసియాక‌ప్ (Asia Cup) 2023లో విరాట్ బ్యాటింగ్ లో అద‌ర‌గొడుతున్నాడు. చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్ పై శ‌త‌కంతో చెల‌రేగిన కోహ్లీ కొలంబో వేదిక‌గా మంగ‌ళ‌వారం శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచులో మాత్రం విఫ‌లం అయ్యాడు. అయిన‌ప్ప‌టికీ ఫీల్డింగ్‌లో మాత్రం దూకుడు ప్ర‌దర్శించాడు. అంతేనా ఫీల్డింగ్ చేసేట‌ప్పుడు కోహ్లీ.. లుంగీ డ్యాన్స్ పాట‌కు సెప్పులు వేశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఆసియా క‌ప్ శ్రీలంక‌లో జ‌రుగుతున్న‌ప్ప‌టీకీ భార‌త్ ఆడే ప్ర‌తీ మ్యాచ్‌లోనూ బాలీవుడ్ పాట‌ల‌ను ప్లే చేస్తున్నారు. ప్ర‌తీ ఓవ‌ర్ ముగియ‌గానే హిందీ పాట‌ల‌తో హోరెత్తిస్తున్నారు. అలా లంక‌తో మ్యాచ్‌లో సైతం ప‌లు పాట‌ల‌ను ప్లే చేశారు. లుంగీ డ్యాన్స్ పాట వ‌స్తున్న స‌మ‌యంలో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ అదిరిపోయే స్టెప్పులు వేశాడు. అది చూసిన స్టేడియంలోని అభిమానులు కేరింత‌లు కొడుతూ, అరుస్తూ అత‌డిని ఎంక‌రేజ్ చేశారు. ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

ICC ODI rankings : కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో గిల్‌.. టాప్-10లో ముగ్గురు భార‌త ఆట‌గాళ్లు

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే మొద‌ట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 49.1 ఓవర్లలో 213 పరుగులకు కుప్ప‌కూలింది. భార‌త బ్యాటర్లలో రోహిత్ శర్మ (53; 48 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్సర్లు) అర్థ‌శ‌త‌కంతో ఆకట్టుకోగా కేఎల్ రాహుల్ (39), ఇషాన్ కిషన్ (33)లు రాణించారు. లంక బౌలర్లలో దునిత్ వెల్లలాగే ఐదు, చరిత అసలంక నాలుగు, మహేశ్ తీక్షణ ఓ వికెట్ తీశారు.

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో శ్రీలంక 41.3 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌటైంది. దీంతో భార‌త్‌ 41 పరుగుల తేడాతో గెలిచింది. శ్రీలంక బ్యాటర్లలో దునిత్ వెల్లలాగే (42 నాటౌట్) ధనంజయ డిసిల్వా (41) త‌మ జ‌ట్టును గెలిపించేందుకు విఫ‌లయ‌త్నం చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ నాలుగు, బుమ్రా, జడేజా చెరో రెండు సిరాజ్, హర్ధిక్ ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

Asia Cup 2023 : స్టేడియంలో కొట్టుకున్న భార‌త్, శ్రీలంక ఫ్యాన్స్‌..!