కోహ్లీని ట్విట్టర్‌లో ఆడుకుంటున్న నెటిజన్లు

కోహ్లీని ట్విట్టర్‌లో ఆడుకుంటున్న నెటిజన్లు

Updated On : April 1, 2019 / 12:08 PM IST

11 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒక్క టైటిల్ కూడా దక్కించుకోలేకపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్‌లో విజేతగా నిలవాలని తీవ్రంగా శ్రమిస్తోంది. అయినా ఆ జట్టుకి నిరాశ తప్పడం లేదు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్.. బెంగళూరుపై 118పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. 
Read Also : పవన్ హామీలు : స్టూడెంట్స్‌కి ల్యాప్ టాప్.. ఆడపిల్లలకు మహాలక్ష్మి పథకం

ఈ మ్యాచ్‌కు ముందు బెంగళూరు ఒక్క బంతి తేడాతో ఓడిపోవడంతో అందరి కళ్లు తర్వాతి మ్యాచ్‌పైనే ఉన్నాయి. ఈ క్రమంలో రాయల్ చాలెంజర్స్ కూడా అదే స్థాయిలో మ్యాచ్‌కు సిద్ధమైంది. కానీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ ధాటికి తాళలేక చేతులెత్తేసింది. ఒకానొక దశలో 50పరుగులు కూడా చేయలేదనుకున్న జట్టు అతి కష్టం మీద 118పరుగులు చేయగలిగింది. 

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్‌లు విజృంభించడంతో జట్టు స్కోరు 231పరుగులకు చేరింది. చేధనకు దిగిన ప్లేయర్లలో ఓపెనర్ 11 పరుగులు మినహాయించి శివం దూబె వరకూ అంతా సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ అయ్యారు. ఆ పరిస్థితుల్లో గ్రాండ్ హోమ్ క్రీజులోకి వచ్చి జట్టు పరువుపోకుండా కాపాడాడు. ఈ ప్రదర్శన పట్ల కెప్టెన్ విరాట్ కోహ్లీని తీవ్రంగా విమర్శిస్తున్నారు నెటిజన్లు.  

Read Also : ఇక కంట్రోల్ మీ చేతుల్లో : ఫేస్‌బుక్.. News Feed మార్చేస్తోంది