Virat Kohli : విరాట్ కోహ్లీ మ్యాజిక్..! వ‌రుసగా వికెట్లు కోల్పోయిన ద‌క్షిణాఫ్రికా..!

సెంచూరియ‌న్ వేదిక‌గా భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న‌ మొద‌టి టెస్టు మ్యాచులో ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది.

Virat Kohli : విరాట్ కోహ్లీ మ్యాజిక్..! వ‌రుసగా వికెట్లు కోల్పోయిన ద‌క్షిణాఫ్రికా..!

Virat Kohli

Updated On : December 27, 2023 / 9:06 PM IST

Virat Kohli- Jasprit Bumrah : సెంచూరియ‌న్ వేదిక‌గా భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న‌ మొద‌టి టెస్టు మ్యాచులో ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. రెండో రోజు ఆట రెండో సెష‌న్‌లో ఇది చోటు చేసుకుంది. విరాట్ కోహ్లి చేసిన ఓ ప‌ని ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ఏం జ‌రిగిందంటే..?

టీమ్ఇండియాను తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ చేసిన త‌రువాత ద‌క్షిణాఫ్రికా బ్యాటింగ్‌కు దిగింది. ఐదు ప‌రుగులు చేసిన ఓపెన‌ర్ మార్‌క్ర‌మ్‌ను మ‌హ్మ‌ద్ సిరాజ్ బోల్తా కొట్టించ‌డంతో సౌతాఫ్రికా 11 ప‌రుగుల వ‌ద్ద మొద‌టి వికెట్ కోల్పోయింది. వ‌న్ డౌన్ బ్యాట‌ర్ టోనీ డి జోర్జి (28)తో జ‌త క‌లిసిన మ‌రో ఓపెన‌ర్ డీన్ ఎల్గ‌ర్ భార‌త బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగారు. ఓ వైపు టోని వికెట్ కాపాడుకునేందుకు ప్ర‌య‌త్నిస్తే ఎల్గ‌ర్ మాత్రం భార‌త బౌల‌ర్ల ల‌య‌ను దెబ్బ‌తీశాడు.

IPL 2024 : కేకేఆర్, ఎస్ఆర్‌హెచ్‌, ల‌క్నో జ‌ట్ల‌కు షాక్‌..!

ఓవ‌ర్‌కు దాదాపు నాలుగు కంటే ఎక్కువ ప‌రుగులు సాధించారు. ఈ ద‌శ‌లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ బౌల‌ర్ల‌ను ప‌దే ప‌దే మార్చిన‌ప్ప‌టికీ పెద్ద‌గా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. ఎవ‌రు బౌలింగ్‌కు వ‌చ్చినా కూడా ఈ ద్వ‌యం స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంది. 93 ప‌రుగుల భాగ‌స్వామ్యంతో ప్ర‌మాద‌క‌రంగా ఈ జోడి మారింది. ఈద‌శ‌లో విరాట్ కోహ్లి ఏదో మ్యాజిక్ చేశాడు.

28 వ ఓవ‌ర్ పూర్తి కాగానే విరాట్ కోహ్లి వికెట్ వ‌ద్ద‌కు వెళ్లాడు. అక్క‌డ ఉన్న బెయిల్స్‌ను మార్చాడు. 29వ ఓవ‌ర్‌ను జ‌స్‌ప్రీత్ బుమ్రా వేశాడు. మూడో బంతిని టోనీ డి జోర్జి ఫోర్ కొట్టిన‌ప్ప‌టికీ ఆ ఓవ‌ర్ చివ‌రి బంతికి ఔట్ అయ్యాడు. బుమ్రా త‌న మ‌రుస‌టి ఓవ‌ర్‌లోనే కీగన్ పీట‌ర్స‌న్ (2) క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో సౌతాఫ్రికా 9 ప‌రుగుల వ్య‌వ‌ధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది.

KL Rahul : దక్షిణాఫ్రికా కామెడీ ఎర్ర‌ర్స్‌.. కేఎల్ రాహుల్ అద్భుత సెంచ‌రీకి ఎలా తోడ్పాయో తెలుసా..?

కాగా.. విరాట్ కోహ్లి చేసిన ప‌ని సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కోహ్లి వికెట్ల‌కు ఏదో మంత్రం వేశాడ‌ని, అందుక‌నే స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో సౌతాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయింది అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఏడాది యాషెష్ సిరీస్‌లో ఇంగ్లాండ్ బౌల‌ర్ స్టువ‌ర్ట్ బ్రాడ్ ఇలాగే చేసి ఫ‌లితాన్ని రాబ‌ట్టిన విష‌యాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

అంతక‌ముందు కేఎల్ రాహుల్ సెంచ‌రీ (101) చేయ‌డంతో భార‌త్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 245 ప‌రుగులకు ఆలౌటైంది.