Virat Kohli : ధురంధర్ 2 చిత్రంపై విరాట్ కోహ్లీ కామెంట్స్.. 4 గంటలు.. నాలో ప్రతి..
ధురంధర్ 2 చిత్రాన్ని విరాట్ కోహ్లీ (Virat Kohli ) వీక్షించాడు.
Virat Kohli watched Ranveer Singh Dhurandhar 2 movie
- ధురంధర్ 2 చిత్రాన్ని వీక్షించిన కోహ్లీ
- అద్భుతంగా ఉందని ప్రశంస
Virat Kohli : బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన చిత్రం ధురంధర్ 2. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ చిత్రం ధురంధర్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను అందుకున్న ధురంధర్ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే 1600 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
తాజాగా ఈ జాబితాలో టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ సైతం చేరిపోయాడు. తాను ఈ చిత్రాన్ని వీక్షించినట్లు సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఇదొక అద్భుతమైన చిత్రం అని, భారతీయ సినిమాల్లో ఇలాంటి అనుభవం తాను ఇంతకము ముందెన్నడూ చూడలేదని తెలిపాడు.
*అవేశ్ ఖాన్ పై బీసీసీఐకి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫిర్యాదు?
‘ఈరోజు సినిమా చూశాను. ఇలాంటి ఓ అద్భుతమైన సినిమా అనుభవాన్ని భారతీయ సినిమాల్లో ఇంతకముందు ఎన్నడూ చూడలేదని చెప్పగలను. అన్ని రకాల భావోద్వేగాలను బయటకు తీసుకువచ్చింది. దాదాపు 4 గంటల పాటు నేను ఒక్కసారి కూడా కనురెప్ప వేయలేదు. ఆదిత్య .. మీ ప్రతిభ, పట్టుదల మీరు సృష్టించిన ఈ అద్భుతంలో కనిపిస్తున్నాయి. మీకు హ్యాట్స్ ఆఫ్. మీరు ఒక మేధావి. నటీనటులందరూ తమ పాత్రలలో అద్భుతంగా ఒదిగిపోయినప్పటికి కూడా రణ్‌వీర్‌సింగ్ ఈ చిత్రం తరువాత మీరు ఓ కొత్త శిఖరాన్ని చేరుకున్నారు. మీ నటన అద్భుతానికి మించినది. వావ్.’ అని కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు.

*రాజస్థాన్‌తో ముంబై మ్యాచ్ నేడు.. హార్దిక్ పాండ్యా ఆడేనా? ముంబై కోచ్ ఏమన్నాడంటే?
ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్లో బిజీగా ఉన్నాడు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ 2026లో అదరగొడుతోంది. ఇప్పటి వరకు ఆర్సీబీ రెండు మ్యాచ్‌లు ఆడగా రెండింటిలోనూ విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.
