Sehwag: ధోనికి సెహ్వాగ్ వెరైటీ విషెస్.. 7/7/7తో Happy Birthday ట్వీట్!

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. ఎంఎస్ ధోనికి వెరైటీగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

Sehwag: ధోనికి సెహ్వాగ్ వెరైటీ విషెస్.. 7/7/7తో Happy Birthday ట్వీట్!

Virender Sehwag birthday wishes MS Dhoni

Sehwag Wished Dhoni : మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) ట్విటర్ లో యమ యాక్టివ్ గా ఉంటాడు. సమకాలిన అంశాలపై తనదైన శైలిలో స్పందింస్తుంటాడు. క్రికెట్ (Cricket) కు గుడ్ బై చెప్పిన తర్వాత సోషల్ మీడియాలో యాక్టివైపోయాడు. సెటైర్లు, పంచ్ లు వేయడమే విభిన్నంగా కమెంట్ చేయడంలోనూ వీరూ రూటే సెపరేటు. తాజాగా మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) కి పుట్టినరోజు సందర్భంగా వెరైటీగా విషస్ (Birthday Wishes) తెలిపాడు.

టీమిండియా లెజండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని నేడు (జులై 7) 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ధోనికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్విటర్ లో వెరైటీ పోస్ట్ పెట్టాడు. ”సూర్య భగవానుడి గుర్రాలు 7, రుగ్వేదంలోని భాగాలు 7, రుతువులు 7, కోటలు 7, సంగీత స్వరాలు 7, పెళ్లిలో వేసే అడుగులు 7, ప్రపంచంలోని అద్భుతాలు 7.. 7వ నెలలోని 7వ తేదీన అగ్రశ్రేణి వ్యక్తి పుట్టినరోజు @msధోని” అంటూ ట్వీట్ చేశాడు. ధోనితో కలిసివున్న ఫోటోలను తన ట్వీట్ కు జత చేశాడు.

వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ట్వీట్ పై నెటిజనులు కూడా స్పందించారు. ధోని జెర్సీ నంబరు కూడా 7 అని గుర్తు చేశారు. 2011 వన్డే ప్రపంచకప్ లో రివ్యూకు మీరు తీసుకున్న సమయం 7 సెకన్లు అని మరొకరు కమెంట్ చేశారు. MS DHONI పేరులో కూడా ఏడు అక్షరాలు ఉన్నాయని వెల్లడించారు. ఇంద్రధనస్సులో ఏడు రంగులను మిసయ్యారని గుర్తు చేశారు. అయితే మనం ఫాలో అయ్యే రుతువులు 6 మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. విభిన్నంగా శుభాకాంక్షలు చెప్పిన సెహ్వాగ్ ను చాలా మంది ప్రశంసిస్తూ కమెంట్లు పెట్టారు.

Also Read: ధోనికి ఎవరెవరు బర్డే విషెస్ చెప్పారో తెలుసా..

కాగా, ఎంఎస్ ధోనికి మాజీ క్రికెటర్లు, వర్దమాన ఆటగాళ్లతో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాయి. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోని కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2023లో సీఎస్కే విజేతగా నిలిచింది. దీంతో ధోని తర్వాత ఐపీఎల్ సీజన్ ఆడతాడా, లేదా అనే దానిపై క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వచ్చే ఐపీఎల్ సీజన్ లోనూ ధోని ఆడాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు.