VIVOని తప్పుకున్నాక స్పాన్సర్లు లేక బీసీసీఐ తంటాలు

VIVOను ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ నుంచి తొలగించాక స్పాన్సర్లే దొరక్కుండాపోయారు బీసీసీఐకి. ఇప్పటికే ఐపీఎల్ 2020కి పలు అవాంతరాలు రావడంతో వాయిదాలు పడుతూ వచ్చింది. కొద్ది రోజుల క్రితం యాంటీ చైనా సెంటిమెంట్లతో ఐపీఎల్‌కు స్పాన్సర్‌షిప్ వద్దంటూ తిరస్కరించింది బీసీసీఐ. అదే సమయంలో చైనా బ్రాండ్లు అయిన OPPO, Real Me, Xiaomi, Huawei, Lenovoలు కూడా T20 లీగుల నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నట్లు తెలిపాయి.
బీసీసీఐ టైటిల్ స్పాన్సర్‌షిప్ కు వీవో రూ.440కోట్లు చెల్లించేది. కానీ, బాయ్ కాట్ చైనా మొదలవడంతో స్మార్ట్ ఫోన్ బ్రాండ్ స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకోవాలనుకుంది. రెండు దేశాల మధ్య రాజకీయ ఒత్తిడుల నుంచి దూరమైంది. ఈ క్రమంలో బీసీసీఐ కొత్త స్పాన్సర్ కోసం వెదుకుతుంటే దొరికేట్లుగా కనిపించడం లేదు.
బీసీసీఐతో పాటు స్టార్ స్పోర్ట్స్ కు సమస్య ఏంటనంటే.. ఐపీఎల్ జరుగుతున్న సమయంలో అడ్వర్టైజ్‌మెంట్లు ఇవ్వడానికి కూడా చైనా బ్రాండ్లు ముందుకు రావడం లేదు. ఈ విషయాన్ని ఓ చైనా కంపెనీలకు అడ్వర్టైజింగ్ మీడియేటర్ గా వ్యవహరించే ఏజెన్సీ చెప్పింది.
‘చైనీస్ బ్రాండ్స్ కు వ్యతిరేకమైన సెంటిమెంట్ బలంగా ఉంది. మా క్లయింట్లకు ఈ అడ్వర్టైజింగ్ నుంచి దూరంగా ఉండమని చెప్తున్నాం. ఇది ఐపీఎల్ 2020 అయినా లేదా మరేదైనా టెలివిజన్ ప్రోపర్టీ అయినా చైనీస్ బ్రాండ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్వర్టైజ్ చేయకూడదు’ అని చెప్పింది ఆ ఏజెన్సీ.
కొన్ని సంవత్సరాలుగా ఐపీఎల్ కు అడ్వర్టైజింగ్ కేటగిరీలో మొబైల్ కంపెనీలే టాప్ గా ఉన్నాయి. వాటి స్థానంలో మరో వాటిని భర్తీ చేయడం చాలా కష్టమైన పని. Edtech companies ఈ సారి పెద్ద అడ్వర్టైజింగ్ కంపెనీగా నిలవనుంది.
ఎకానమీ డౌన్ అయిపోవడంతో అడ్వర్టైజింగ్ చేయలేకపోతున్నం. ఏప్రిల్-మే నెల పండుగ రోజుల్లో బిజినెస్ అసలు అవలేదు. ఈ ఏడాదికి చాలా బిజినెస్ జరగాలని ఆశిస్తున్నట్లు మరో మీడియా చెప్పుకొచ్చింద. పేటీఎం, స్విగ్గీ, జొమాటో, డ్రీమ్ 11లకు కూడా చైనా లింకులు ఉండటంతో అవి కూడా అడ్వర్టైజింగ్ నుంచి తప్పుకోనున్నాయా అనే సందేహం మొదలైంది.
గతేడాది రూ.2వేల100కోట్లు లాభం తెచ్చుకున్న స్టార్ ఇండియా ఈ ఏడాది రూ.1500-1700కోట్లు వస్తే చాలని భావిస్తుంది. కొత్త స్పాన్సర్ల వేటలో పడ్డ బీసీసీఐకి.. మరో వారం గడిస్తే గానీ ఐపీఎల్ 13కి స్పాన్సర్ షిప్ చేసేదెవరో తెలియదు.