SRH vs GT : వర్షం మంచిదే.. ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టనున్న హైదరాబాద్..! గుజరాత్ బౌలర్లు హ్యాపీ..!
ఐపీఎల్ 17వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మాత్రమే అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి.

What happen if SRH vs GT match match abandoned
Sunrisers Hyderabad vs Gujarat Titans : ఐపీఎల్ 17వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మాత్రమే అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి. మరో రెండు స్థానాల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ప్లే ఆఫ్స్ బరిలో ఉన్నాయి. ఈ జట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్లే ఆఫ్స్ చేరుకునేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి.
హైదరాబాద్ రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ రెండింటిలో ఒక్కటి గెలిచినా కూడా ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఈ క్రమంలో నేడు (మే 16 గురువారం) హోంగ్రౌండ్ ఉప్పల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన గుజరాత్ టైటాన్స్‌కు ఇది నామమాత్రపు మ్యాచ్ మాత్రమే కానుంది.
ఈ మ్యాచ్‌లో గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకోవాలని హైదరాబాద్ భావిస్తోంది. అయితే.. ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ఉప్పల్‌లో వర్షం కురుస్తోంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే పరిస్థితి ఏంటి? సన్ రైజర్స్ పై ఎలాంటి ఎఫెక్ట్ పడనుందో ఓ సారి చూద్దాం..
వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే..
వర్షం కారణంగా ఉప్పల్‌లో జరగాల్సిన సన్‌రైజర్స్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ రద్దైతే ఇరు జట్లకు ఒక్కొ పాయింట్ కేటాయిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ ఖతాలో 14 పాయింట్లు ఉన్నాయి. మ్యాచ్ రద్దైతే పాయింట్ల సంఖ్య 15కు చేరుకుంటుంది. దీంతో అధికారికంగా హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది.
Also Read : ఏమయ్యా గోయెంకా.. పంత్‌ను కౌగిలించుకున్నావ్ సరే.. రాహుల్‌తో మళ్లీ ఏందిది..
ఎందుకంటే ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న జట్లలో ఒక్క చెన్నై మినహా మిగిలిన ఏ జట్టు కూడా సన్‌రైజర్స్ కంటే ఎక్కువ పాయింట్లను సాధించే అవకాశం లేదు. చివరి మ్యాచ్‌లో ఆర్‌సీబీ పై చెన్నై విజయం సాధిస్తే అప్పుడు చెన్నై ఖాతాలో 16 పాయింట్లు వచ్చి చేరుతాయి. ఇక సన్‌రైజర్స్ తన ఆఖరి మ్యాచ్‌లో గెలిచి రాజస్థాన్ తన చివరి మ్యాచ్‌లో ఓడిపోతే అప్పుడు హైదరాబాద్ టాప్-2 జట్టుగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టనుంది.
లక్నో, ఢిల్లీకి నో ఛాన్స్..
హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరుకుంటే అప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ గల్లంతు అవుతాయి. ఎందుకంటే చెన్నై ఖాతాలో 14 పాయింట్లు ఉండగా, ఆర్‌సీబీ ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. సీఎస్‌కే, ఆర్‌సీబీ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ లో చెన్నై గెలిస్తే 16 పాయింట్లతో నాలుగో జట్టుగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టనుంది.
Also Read : ఐపీఎల్‌లో కోహ్లి బిజీ.. విరాట్ రికార్డుల పని పడుతున్న బాబర్ ఆజాం
ఒకవేళ ఆర్‌సీబీ మంచి రన్‌రేట్‌తో గెలిస్తే ఆ జట్టు వెళ్లే అవకాశం ఉంది. స్వల్ప తేడాతో గెలిస్తే మాత్రం చెన్నై కే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఢిల్లీ, లక్నోలు ఇంటి బాట పట్టక తప్పదు. ఎందుకంటే.. చెన్నై , ఆర్‌సీబీ నెట్‌రన్‌రేటు ఫ్లస్‌లో ఉండడమే అందుకు కారణం.
Also Read: భువనేశ్వర్‌కుమార్‌కు షాక్.. ఐపీఎల్ చరిత్రలో ట్రెంట్ బౌల్ట్ ఒకే ఒక్కడు..
గుజరాత్ బౌలర్లు హ్యాపీ..!
వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే అందరికి కంటే ఎక్కువ సంతోషించేది గుజరాత్ బౌలర్లే కావొచ్చునని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు వీరవిహారం చేస్తున్నారు. ప్రత్యర్థి ఎవరైనా సరే వారి బౌలింగ్‌ను చీల్చిచెండాడుతున్నారు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 167 పరుగుల లక్ష్యాన్ని పది ఓవర్లలోపే ఛేదించారు. దీంతో సన్‌రైజర్స్ బ్యాటర్లకు బౌలింగ్ చేసేందుకు ప్రత్యర్థి బౌలర్లు తటపటాయిస్తున్నారు. వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే.. సన్‌రైజర్స్ బ్యాటర్ల బాదుడు నుంచి గుజరాత్ బౌలర్లు తప్పించుకోవచ్చునని ఎస్ఆర్‌హెచ్ అభిమానులు అంటున్నారు.