Bolivia : ఫుట్ బాల్ మ్యాచ్, హఢలెత్తించిన దుమ్ము తుఫాన్..వీడియో వైరల్

దుమ్ము తుఫాన్ అందర్నీ హఢలెత్తించింది. గ్రౌండ్ లో రింగు రింగులుగా తిరుగుతూ...రావడంతో అప్పటి వరకు అక్కడ ఉన్న క్రీడాకారులు తలో దిక్కుకు పరుగులు తీశారు. ఈ ఘటన బొలివియాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు ట్విట్టర్ వేదికగా హల్ చల్ చేస్తున్నాయి.

Bolivia : ఫుట్ బాల్ మ్యాచ్, హఢలెత్తించిన దుమ్ము తుఫాన్..వీడియో వైరల్

Football

Whirlwind Football Match : ఫుట్ బాల్ మ్యాచ్ జరగడానికి కొద్ది నిమిషాలు ఉండగా…దుమ్ము తుఫాన్ అందర్నీ హఢలెత్తించింది. గ్రౌండ్ లో రింగు రింగులుగా తిరుగుతూ…రావడంతో అప్పటి వరకు అక్కడ ఉన్న క్రీడాకారులు తలో దిక్కుకు పరుగులు తీశారు. ఈ ఘటన బొలివియాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు ట్విట్టర్ వేదికగా హల్ చల్ చేస్తున్నాయి. క్రీడాకారులు ధరించిన దుస్తులు గాల్లోకి అమాంతం లేచిపడ్డాయి. బోలివియాలో ఫుట్ బాల్ టోర్నమెంట్ మ్యాచ్ జరుగబోతోంది.

Read More : Sadaa : సదా.. గ్లామర్ ఏమాత్రం తగ్గలేదుగా..

ఇరు జట్లకు చెందిన క్రీడాకారులు చెరోవైపు నిల్చొన్నారు. మధ్యలో రిఫరీలు నిలబడ్డారు. అంతలో గ్రౌండ్ లో సుడిగాలి గిర్రుగిర్రున తిరుగుతూ వచ్చింది. దీంతో క్రీడాకారులు భయపడిపోయారు. చెరో దిక్కుకు పరుగులు తీశారు. కొంతమంది ప్రశాంతంగా ఉన్నారు. ఓ క్రీడాకారుడి జాకెట్ అమాంతం పైకి లేచి కిందపడింది. దీనికి సంబంధించిన దృశ్యాలను కొంతమంది వీడియో తీసి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ వీడియోలు వైరల్ గా మారాయి.