Kishkindapuri X Review: కిష్కిందపూరి ఎక్స్ రివ్యూ.. బెల్లం అన్న హిట్ కొట్టాడా.. ఆడియన్స్ రియాక్షన్ ఏంటి?

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన కొత్త సినిమా కిష్కిందపురి(Kishkindapuri X Review). దర్శకుడి కౌశిక్ పెగళ్ళపాటి తెరకెక్కించిన ఈ హారర్ అండ్ త్రిల్లర్ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించారు.

Kishkindapuri X Review: కిష్కిందపూరి ఎక్స్ రివ్యూ.. బెల్లం అన్న హిట్ కొట్టాడా.. ఆడియన్స్ రియాక్షన్ ఏంటి?

Bellamkonda Srinivas Kishkindapuri Movie X Review

Updated On : September 12, 2025 / 6:14 AM IST

Kishkindapuri X Review: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన కొత్త సినిమా కిష్కిందపురి. దర్శకుడి కౌశిక్ పెగళ్ళపాటి తెరకెక్కించిన ఈ హారర్ అండ్ త్రిల్లర్ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించారు. ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా నేడు విడుదల కానుంది. అయితే, ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్ షోస్ పడటంతో సినిమా చుసిన ఆడియన్స్ సోషల్(Kishkindapuri X Review) మీడియా వేదికగా సినిమాపై తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.

Mirai Movie : ‘మిరాయ్‌’ మూవీలో అతిధి పాత్రలో ప్రభాస్..? చిత్ర హీరో తేజ సజ్జా ట్వీట్ వైరల్.. ఫ్యాన్స్‌కు పండగే..

ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు పాజిటీవ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. సినిమా చాలా బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో హారర్ ఎలిమెంట్స్ చాలా బాగా వర్క్ అవుట్ అయ్యాయని, కొన్ని సీన్స్ కి ఒళ్ళు వణికిపోయింది అంటున్నారు. ట్విస్టులు కూడా నెక్స్ట్ లెవల్లో ప్లాన్ చేశారని చెప్తున్నారు. స్టోరీని తీసుకెళ్లిన విధానం, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్నీ పర్ఫెక్ట్ గా సెట్ ఆయ్యాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫైనల్ గా ఫస్ట్ హాల్ఫ్ అదిరిపోయిందని, సెకండ్ హాల్ఫ్ ఇంకాస్త జాగ్రత్తపడితే బాగుండేది అంటున్నారు. సో ఫైనల్ గా కిష్కిందపురి సినిమాకి ప్రీమియన్స్ నుంచి మాత్రం పాజిటీవ్ టాక్ వచ్చింది.