CWC 2023: వరల్డ్ కప్ 20 ఏళ్ల నాటి రికార్డు.. బ్రేక్ చేసేదెవరో?
20 ఏళ్లుగా వరల్డ్ కప్ రికార్డు టాప్ బ్యాటర్లను ఊరిస్తోంది. ఈసారైనా ఈ రికార్డు బ్రేక్ అవుతుందా, సరికొత్త రికార్డు నమోదవుతుందా?

who will be broken sachin tendulkar record for most run in world cup
World Cup Most Runs Record: వన్డే ప్రపంచకప్ ఓ రికార్డు టాప్ బ్యాటర్లను ఊరిస్తోంది. 20 ఏళ్ల నాటి ఆ రికార్డు ఈసారి బద్దలయ్యే చాన్స్ కనిపిస్తోంది. ఇంతకుముందు ఒకరిద్దరు దగ్గర వరకు వచ్చి ఆగిపోయారు కానీ బ్రేక్ చేయలేకపోయారు. ఏంటా రికార్డు? వరల్డ్ కప్ సింగిల్ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు టీమిండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. 2003లో సచిన్ ఈ రికార్డు నెలకొల్పారు. ఆ ఎడిషన్ లో 11 మ్యాచ్ లు ఆడిన మాస్టర్ బ్లాస్టర్ 6 హాఫ్ సెంచరీ, ఒక సెంచరీతో 673 పరుగులు చేశారు.
ఇప్పటివరకు ఈ రికార్డు అలాగే ఉంది. 2003 తర్వాత 5 ప్రపంచకప్ టోర్నమెంట్ లు జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్నది ఆరోది. 2007లో ఆస్ట్రేలియా బ్యాటర్ మాథ్యూ హేడెన్(659), 2019లో టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ(648) సచిన్ రికార్డుకు చేరువగా వచ్చారు. తాజా వరల్డ్ కప్ లో ఐదుగురు ఆటగాళ్లు ఈ రికార్డు వేటలో నిలిచారు. విరాట్ కోహ్లి(594), క్వింటన్ డికాక్ (591), రచిన్ రవీంద్ర (565), రోహిత్ శర్మ (503), డేవిడ్ వార్నర్(499) సచిన్ రికార్డుపై కన్నేశారు. ప్రస్తుత ఫామ్ బట్టి చూస్తే ఈ ఐదుగురికీ అవకాశం ఉంది. అయితే రోహిత్ శర్మ వరుసగా రెండో ప్రపంచకప్ లోనూ 500 పరుగులు చేసి తన పవరేంటో చూపించాడు.
ప్రపంచకప్ మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో టీమిండియా తలపడనుంది. ఒకవేళ మ్యాచ్ భారత్ గెలిచి ఫైనల్ చేరితే కోహ్లి, రోహిత్ శర్మకు ఎక్కువ అవకాశాలుంటాయి. రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా పోటీ పడతాయి. ఈ రెండు జట్లలో ఉన్న డికాక్, వార్నర్ ఫామ్ ను కంటిన్యూ చేస్తే సచిన్ రికార్డును అందుకోవడం ఏమంత కష్టం కాదు. సెమీస్, ఫైనల్లో భాగా ఆడి ఎవరు ఎక్కువ పరుగులు సాధిస్తే వాళ్లు టాప్ స్కోరర్ గా నిలుస్తారు. మరి సచిన్ రికార్డును ఈ వరల్డ్ కప్ లో బ్రేక్ చేస్తారా, లేదా తెలియాలంటే ఫైనల్ మ్యాచ్ వరకు వేచి చూడక తప్పదు.
Also Read: వన్డే ప్రపంచకప్.. టాప్ 5 బ్యాటర్లు, బౌలర్లు వీరే.. అశ్విన్ ఆడింది ఒక్క మ్యాచ్.. కానీ