IPL 2025: టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్‌ పఠాన్‌కు బీసీసీఐ షాక్

ఈ నేపథ్యంలో ఇర్ఫాన్‌ పఠాన్ యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించి మాట్లాడారు.

IPL 2025: టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్‌ పఠాన్‌కు బీసీసీఐ షాక్

Irfan Pathan

Updated On : March 22, 2025 / 9:57 PM IST

టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్‌ పఠాన్‌కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. ఆయనను ఐపీఎల్‌ కామెంట్రీ ప్యానెల్‌ నుంని తొలగించినట్లు సమాచారం. ఐపీఎల్‌ 2025 మ్యాచ్‌లకు కామెంట్రీ ప్యానెల్‌ను తాజాగా రిలీజ్ చేశారు.

అయితే, ఇర్ఫాన్‌ పఠాన్‌ పేరు అందులో లేదు. గత ఐపీఎల్‌ సీజన్లలో ఇర్ఫాన్ పఠాన్ కామెంటేటర్‌గా ఉండేవారు. అతడిపై పలు ఫిర్యాదులు వచ్చాయి. ఐపీఎల్‌ విశ్వసనీయ వర్గాలు జాతీయ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. రెండేళ్లుగా ఇర్ఫాన్ పఠాన్ కొందరు క్రికెటర్లపై పర్సనల్‌ ఎజెండాతో కామెంట్లు చేస్తున్నారు.

ఆయన తీరు సరికాదని బీసీసీఐ అధికారులు భావించారు. ఇర్ఫాన్‌ పఠాన్‌పై కొందరు భారత క్రికెటర్ల నుంచి కూడా కంప్లైంట్లు వచ్చాయి. ఆస్ట్రేలియాలో బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ జరిగిన వేళ కూడా పలువురు ప్లేయర్లపై ఇర్ఫాన్ పఠాన్‌ కామెంట్లు చేశారు.

ఆ తర్వాత ఓ ప్లేయర్‌ పఠాన్‌ నంబరును తన ఫోన్‌లో బ్లాక్‌ చేసినట్లు తెలుస్తోంది. తనను ప్యానెల్‌ నుంచి తొలగించిన నేపథ్యంలో ఇర్ఫాన్‌ పఠాన్ యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించి మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు.

ఇక్కడ సత్యాలనే మాట్లాడుకుందామని అన్నారు. ఆటగాళ్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే బీసీసీఐ చర్యలు తీసుకుంటుంది. గతంలో సంజయ్‌ మంజ్రేకర్‌, హర్ష భోగ్లేపై చర్యలు తీసుకుంది. ఐపీఎల్‌ 2025 మ్యాచులు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. శుక్రవారం కామెంట్రీ ప్యానెల్‌లోని వారి పేర్లను విడుదల చేశారు.