Smriti Mandhana : చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. 28 ఏళ్ల ప్రపంచ రికార్డు బ్రేక్..
స్మృతి మంధాన (Smriti Mandhana) అరుదైన ఘనత సాధించింది.

Womens World Cup 2025 Smriti Mandhana creates history to became first player
Smriti Mandhana : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. మహిళల క్రికెట్‌లో ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మంధాన (Smriti Mandhana ) ఈ రికార్డు సాధించింది.
ఈ క్రమంలో ఆమె ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ బెలిండా క్లార్క్‌ను అధిగమించింది. 1997లో బెలిండా మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించింది. ఆ ఏడాది మొత్తంగా బెలిండా 16 మ్యాచ్‌లు ఆడింది. 14 ఇన్నింగ్స్‌ల్లో 80.83 సగటు 98.11 స్ట్రైక్‌రేటుతో 970 పరుగులు సాధించింది. ఇందులో మూడు శతకాలు, నాలుగు అర్థశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 229 నాటౌట్.
🚨 SMRITI MANDHANA BROKE 28 YEAR OLD RECORD IN ODIs 🚨
– Smriti has most runs in a Calendar year in ODI History. 🇮🇳
The Queen of Indian Cricket. pic.twitter.com/vsp28durC3
— Johns. (@CricCrazyJohns) October 9, 2025
మంధాన.. ఈ ఏడాది ఇప్పటి వరకు దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కలుపుకుని 17 ఇన్నింగ్స్‌ల్లో 59.93 సగటుతో 113 కంటే ఎక్కువ స్ట్రైక్‌రేటుతో 971* పరుగులు సాధించింది. ఇందులో నాలుగు శతకాలు, మూడు అర్థశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 135.
మహిళల క్రికెట్‌లో ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్లు వీరే..
* స్మృతి మంధాన (భారత్) – 972* (2025లో)
* బెలిండా క్లార్క్ (ఆస్ట్రేలియా) – 970 పరుగులు (1997లో)
* లారా వోల్వార్డ్ట్ (దక్షిణాఫ్రికా) – 882 పరుగులు (2022లో)
* డెబ్బీ హాక్లీ (న్యూజిలాండ్) – 880 పరుగులు (1997లో)
* అమీ సాటర్త్‌వైట్ (న్యూజిలాండ్) – 853 పరుగులు (2016లో)
ఇక ఈ మ్యాచ్‌లో మంధాన మొత్తంగా 32 బంతులు ఎదుర్కొని ఓ ఫోర్, ఓ సిక్స్ సాయంతో 23 పరుగులు చేసింది.
BCCI : ‘టీమ్ ఇండియా’ పేరును ఉపయోగించుకునేందుకు బీసీసీఐకి అధికారం లేదా..? ఢిల్లీ హైకోర్టు ఏమందంటే..?
దీంతో ఓ క్యాలెండర్ ఇయర్‌లో మంధాన సాధించిన మొత్తం పరుగులు 982 పరుగులకు చేరుకుంది. ఈ మెగాటోర్నీలో భారత్ ఇంకా మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో మంధాన ఈజీగా 1000 పరుగుల మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది.