BCCI : ‘టీమ్ ఇండియా’ పేరును ఉపయోగించుకునేందుకు బీసీసీఐకి అధికారం లేదా..? ఢిల్లీ హైకోర్టు ఏమందంటే..?
బీసీసీఐ (BCCI) నిర్వహిస్తున్న జట్టును టీమ్ ఇండియా అని ప్రసార్ భారతి పేర్కొనడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.

BCCI Not Authorised To Use Team India Name High Court Responds
BCCI : భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) నిర్వహిస్తున్న జట్టును టీమ్ ఇండియా లేదా ఇండియన్ నేషనల్ క్రికెట్ టీమ్ అని ప్రసార్ భారతి పేర్కొనడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఇదంతా మీకు, మాకు సమయం వృథా అని ఢిల్లీ హైకోర్టు.. పిటినర్‌తో వ్యాఖ్యానించింది. చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావుతో కూడిన డివిజన్ బెంచ్ పిటిషన్‌ను తిరస్కరించింది.
న్యాయవాది రీపక్ కన్సల్ ఈ పిల్‌ను దాఖలు చేశారు. బీసీసీఐ ఓ ప్రైవేటు సంస్థ అని, భారత ప్రభుత్వంతో దానికి ఎలాంటి సంబంధం లేదని అందుకనే అది నిర్వహించే జట్టును జాతీయ జట్టుగా పేర్కొనడం తప్పుదారి పట్టించేదిగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రసార భారతి, ఆల్‌ఇండియా రేడియో వంటి వాటిల్లోనూ బీసీసీఐ టీమ్‌ను ‘భారత జట్టు’గా పిలవడం సరైంది కాదని అది తప్పుదారి పట్టించేలా ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ రూల్స్‌పై అవగాహన ఉందా? అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఆ కమిటీలపై కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం ఉండకూడదు అనేది వారి పాలసీ అని స్పష్టం చేసింది. గతంలో ఎప్పుడైనా క్రీడా సమాఖ్యల్లో ప్రభుత్వం కలుగజేసుకున్న సందర్భాలు ఉన్నాయా? అని ప్రశ్నించింది. మెరుగైన పిల్ దాఖలు చేయమని న్యాయవాది రీపక్ కన్సల్‌ను కోరుతూ ఢిల్లీ హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.