World Cup 2023 AUS vs PAK: 62 ప‌రుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘ‌న విజ‌యం

బెంగళూరు వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ ముఖాముఖి తలపడుతున్నాయి.

World Cup 2023 AUS vs PAK: 62 ప‌రుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘ‌న విజ‌యం

PIC @icc twitter

Updated On : October 20, 2023 / 10:09 PM IST

ఆస్ట్రేలియా ఘ‌న విజ‌యం

368 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పాకిస్థాన్ 45.3 ఓవ‌ర్‌లో 305 ప‌రుగుల‌కు ఆలౌటైంది. పాకిస్థాన్ బ్యాట‌ర్ల‌లో ఇమామ్ ఉల్ హక్(70; 71 బంతుల్లో 10 ఫోర్లు), అబ్దుల్లా షఫీక్ (64; 61 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు.

ఉసామా మీర్ ఔట్‌..
హేజిల్ వుడ్ బౌలింగ్‌లో ఉసామా మీర్ ఔట్ (0) మిచెల్ స్టార్క్ చేతికి చిక్కాడు. దీంతో 41.5వ‌ ఓవ‌ర్‌లో 277 ప‌రుగుల వ‌ద్ద పాకిస్థాన్ ఏడో వికెట్ కోల్పోయింది.

రిజ్వాన్ ఔట్‌..
పాకిస్థాన్ మ‌రో వికెట్ కోల్పోయింది. ఆడ‌మ్ జంపా బౌలింగ్‌లో మ‌హ్మ‌ద్ రిజ్వాన్ (46; 40 బంతుల్లో 5 ఫోర్లు) ఎల్బీడ‌బ్ల్యూగా ఔట్ అయ్యాడు. దీంతో 40.5వ‌ ఓవ‌ర్‌లో 274 ప‌రుగుల వ‌ద్ద పాకిస్థాన్ ఆరో వికెట్ కోల్పోయింది.

ఇఫ్తీకర్ అహ్మద్ ఔట్‌
దూకుడుగా ఆడుతున్న ఇఫ్తీక‌ర్ అహ్మ‌ద్ (26; 20 బంతుల్లో 3 ఫోర్లు) ఆడ‌మ్ జంపా బౌలింగ్‌లో ఎల్బీడ‌బ్ల్యూగా ఔట్ అయ్యాడు. దీంతో 38.5వ ఓవ‌ర్‌లో 269 ప‌రుగుల వ‌ద్ద ఐదో వికెట్ కోల్పోయింది.

సౌద్ ష‌కీల్ ఔట్‌..
పాకిస్థాన్ మ‌రో వికెట్ కోల్పోయింది. పాట్ క‌మిన్స్ బౌలింగ్‌లో సౌద్ షకీల్ (30; 31 బంతుల్లో 5 ఫోర్లు) ఔట్ అయ్యాడు. దీంతో 34.2వ ఓవ‌ర్‌లో 232 ప‌రుగుల వ‌ద్ద పాకిస్థాన్ నాలుగో వికెట్ కోల్పోయింది.

కెప్టెన్ బాబ‌ర్ ఆజాం ఔట్‌
పాకిస్థాన్ క్ర‌మం త‌ప్ప‌కుండా వికెట్లు కోల్పోతుంది. ఆడ‌మ్ జంపా బౌలింగ్‌లో క‌మిన్స్ చేతికి చిక్కాడు బాబ‌ర్ ఆజాం (18 ;14 బంతుల్లో 3 ఫోర్లు). దీంతో 26.2 ఓవ‌ర్‌లో 175 ప‌రుగుల వ‌ద్ద పాకిస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది.

ఇమామ్ ఉల్ హక్ ఔట్‌
పాకిస్థాన్ మ‌రో వికెట్ కోల్పోయింది. మార్క‌స్ స్టోయినిస్ బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్ క్యాచ్ అందుకోవ‌డంతో ఇమామ్ ఉల్ హక్(70; 71 బంతుల్లో 10 ఫోర్లు) ఔట్ అయ్యాడు. దీంతో 23.4వ ఓవ‌ర్‌లో 154 ప‌రుగుల వ‌ద్ద పాకిస్థాన్ రెండో వికెట్ కోల్పోయింది.

అబ్దుల్లా షఫీక్ ఔట్‌
ఎట్ట‌కేల‌కు ఆస్ట్రేలియా బౌల‌ర్లు వికెట్ ప‌డ‌గొట్టారు. మార్క‌స్ స్టోయినిస్ బౌలింగ్‌లో మాక్స్ వెల్ క్యాచ్ అందుకోవ‌డంతో అబ్దుల్లా షఫీక్ (64; 61 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) ఔట్ అయ్యాడు. దీంతో 21.1వ ఓవ‌ర్‌లో 134 ప‌రుగుల వ‌ద్ద మొద‌టి వికెట్ కోల్పోయింది.

షఫీక్, ఇమామ్ హాఫ్ సెంచరీలు
అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్ హాఫ్ సెంచరీలు చేశారు. ఇమామ్ 54 బంతుల్లో 8 ఫోర్లతో అర్ధశతకం బాదాడు. షఫీక్ 52 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 20 ఓవర్లలో 131/0 స్కోరుతో పాకిస్థాన్ ఆట కొనసాగిస్తోంది.

దీటుగా ఆడుతోన్న పాకిస్థాన్
368 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ దీటుగా ఆడుతోంది. 17 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 104 పరుగులు చేసింది.

ముగిసిన ఆస్ట్రేలియా బ్యాటింగ్.. పాకిస్థాన్ కు భారీ టార్గెట్
పాకిస్థాన్ కు 368 పరుగుల టార్గెట్ సెట్ చేసింది ఆస్ట్రేలియా. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టపోయి 367 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (163), మిచెల్ మార్ష్ (121) సెంచరీలతో చెలరేగారు. తర్వాత వచ్చిన బ్యాటర్లు భారీ స్కోరు చేయలేకపోయారు. వార్నర్, మార్ష్ జోరు చూస్తే ఆసీస్ స్కోరు 400 పరుగులు దాటుతుందని అనుకున్నారు. కానీ పాకిస్థాన్ బౌలర్లు పుంజుకుని ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టడి చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో షహీన్ ఆఫ్రిది 5, హరీస్ రవూఫ్ 3 వికెట్లు పడగొట్టారు. ఉసామా మీర్ ఒక వికెట్ తీశాడు.

ఇంగ్లిస్ అవుట్.. ఐదో వికెట్ డౌన్
44.4 ఓవర్ లో 339 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. జోష్ ఇంగ్లిస్ 13 పరుగులు చేసి అవుటయ్యాడు.

డేవిడ్ వార్నర్ 150 ప్లస్ స్కోరు
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ చెలరేగాడు. సెంచరీతో కదం తొక్కాడు. 150 ప్లస్ స్కోరుతో పాకిస్థాన్ బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు. వన్డేల్లో ఇప్పటివరకు ఏడుసార్లు 150 ప్లస్ స్కోరు సాధించాడు. వరల్డ్ కప్ లో మూడు పర్యాయాలు అతడీ ఘనత నమోదు చేశాడు. 124 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్సర్లతో 163 పరుగులు చేసి వార్నర్ నాలుగో వికెట్ గా
అవుటయ్యాడు. 43 ఓవర్లలో 330/4 స్కోరుతో ఆసీస్ ఆట కొనసాగిస్తోంది.

స్మిత్ అవుట్.. మూడో వికెట్ డౌన్
38.1 ఓవర్ లో 284 పరుగుల వద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. స్టీవ్ స్మిత్ 7 పరుగులు చేసి ఉసామా మీర్ బౌలింగ్ లో అవుటయ్యాడు. వార్నర్ 140 పరుగులతో ఆడుతున్నాడు. 40 ఓవర్లలో 297/3 స్కోరుతో ఆసీస్ ఆట కొనసాగిస్తోంది.

వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్
33.6 ఓవర్ లో 259 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. మిచెల్ మార్ష్ అవుటైన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన గ్లెన్ మాక్స్‌వెల్ గోల్డెన్ డకౌటయ్యాడు. మిచెల్ 108 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్సర్లతో 121 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. వీరిద్దరినీ షహీన్ ఆఫ్రిది అవుట్ చేశాడు.

వార్నర్, మార్ష్ హాఫ్ సెంచరీలు
ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ సెంచరీలతో చెలరేగారు. ముందుగా వార్నర్ సెంచరీ చేయగా తర్వాత మార్ష్ కూడా సెంచరీ పూర్తి చేశాడు. 100 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ కొట్టాడు. వన్డేల్లో మిచెల్ మార్ష్ కు ఇది రెండో సెంచరీ కావడం గమనార్హం.

 

డేవిడ్ వార్నర్ సెంచరీ
ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్ సెంచరీ కొట్టాడు. 85 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో శతకం బాదాడు. వన్డేల్లో వార్నర్ కు ఇది 21వ సెంచరీ కాగా, పాకిస్థాన్ జట్టుపై నాలుగోది. 30.4 ఓవర్లలో 210/0 స్కోరుతో ఆసీస్ ఆట కొనసాగిస్తోంది.

 

వార్నర్, మార్ష్ హాఫ్ సెంచరీలు
ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. 20 ఓవర్లలో 149/0 స్కోరుతో ఆసీస్ ఆట కొనసాగిస్తోంది. డేవిడ్ వార్నర్ 74, మిచెల్ మార్ష్ 64 పరుగులతో ఆడుతున్నారు.

ఆస్ట్రేలియా 8 ఓవర్లలో 43/0
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 22, మిచెల్ మార్ష్ 15 పరుగులతో ఆడుతున్నారు.

టాస్ గెలిచిన పాకిస్థాన్ 
పాకిస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం బౌలింగ్ వైపే మొగ్గు చూపాడు. షాదాబ్ ఈరోజు ఆడటం లేదని, అతడి స్థానంలో ఉసామా జట్టులోకి వచ్చాడని చెప్పాడు. కాగా, టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ తీసుకునేవాళ్లమని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ తెలిపాడు. తమ జట్టులో ఎటువంటి మార్పులు లేవన్నాడు.

 

తుది జట్లు
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

పాకిస్థాన్ : అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్

AUS vs PAK: ఐసీసీ వన్డే ప్రపంచకప్ భాగంగా నేడు జరగనున్న 18వ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ తలపడుతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ కీలక మ్యాచ్ జరుగుతుంది. ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ఆడిన ఆసీస్ టీమ్ కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది. ఈ మ్యాచ్ లో ఓడితే మున్ముందు క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. పాకిస్థాన్ మూడు మ్యాచ్ ల్లో రెండు గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఈరోజు మ్యాచ్ లో గెలిసి మరింత ముందుకెళ్లాలని పాకిస్థాన్ టీమ్ పట్టుదలతో ఉంది.

 

పాకిస్థాన్ పైచేయి సాధిస్తుందా?
ఐదుసార్లు వన్డే వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియా ఈసారి రెండు ఓటములతో టోర్నమెంట్ ప్రారంభించింది. శ్రీలంకతో జరిగిన మూడో మ్యాచ్ లో విజయాన్ని అందుకుంది. అయితే ఆసీస్ నిజంగానే పుంజుకుందా, లేదా అనేది ఈరోజు మ్యాచ్ తో తేలిపోతుంది. మొదట్లో ఓడిపోయి తర్వాత పుంజుకోవడం ఆస్ట్రేలియా జట్టుకు కొత్తేంకాదు. మరోవైపు శ్రీలంక, నెదర్లాండ్స్ పై గెలిచి.. టిమిండియా చేతిలో ఓడిన పాకిస్థాన్ కు ఆసీస్ తో అసలైన సవాల్ ఎదురుకానుంది. ఆస్ట్రేలియాపై పైచేయి సాధించి ముందుకెళుతుందా, లేదా అనేది ఈరోజు మ్యాచ్ లో తేలనుంది.