Glenn Maxwell : ఆస్ట్రేలియాకు భారీ షాక్‌.. గోల్ఫ్ ఆడుతూ గాయ‌ప‌డిన మాక్స్‌వెల్‌..

వ‌రుస విజ‌యాల‌తో జోష్‌లో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ ఆల్‌రౌండ‌ర్ గ్లెన్ మాక్స్‌వెల్ గాయ‌ప‌డ్డాడు.

Glenn Maxwell : ఆస్ట్రేలియాకు భారీ షాక్‌.. గోల్ఫ్ ఆడుతూ గాయ‌ప‌డిన మాక్స్‌వెల్‌..

Glenn Maxwell suffers concussion

Updated On : November 1, 2023 / 6:33 PM IST

Glenn Maxwell suffers concussion : భారత్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో మొద‌టి రెండు మ్యాచుల్లో ఓడిన ఆస్ట్రేలియా ఆ త‌రువాత పుంజుకుంది. వ‌రుస‌గా నాలుగు మ్యాచుల్లో గెలుపొందింది. వ‌రుస విజ‌యాల‌తో జోష్‌లో ఉన్న ఆస్ట్రేలియాకు భారీ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ ఆల్‌రౌండ‌ర్ గ్లెన్ మాక్స్‌వెల్ గాయ‌ప‌డ్డాడు. దీంతో అత‌డు శ‌నివారం న‌వంబ‌ర్ 4న ఇంగ్లాండ్‌తో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌కు దూరం అయ్యాడు. ఈ విష‌యాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

గోల్ఫ్ ఆడుతున్న‌ప్పుడు మాక్స్‌వెల్‌కు గాయ‌మైంది. గోల్ఫ్ కార్డ్ వాహ‌నం నుంచి అత‌డు ప‌ట్టు త‌ప్పి కింద‌ప‌డిపోయాడు. అత‌డి త‌లకు గాయ‌మైంది. దీంతో కంకష‌న్ ప్రోటోకాల్ ప్ర‌కారం అత‌డు ఐదు నుంచి ఆరు రోజులు పాటు వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉండాల్సి ఉంది. త‌దుప‌రి మ్యాచ్‌కు అత‌డు దూర‌మైన‌ట్లు ఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ వెల్లడించారు. మార్కస్ స్టోయినిస్, కామెరాన్ గ్రీన్ వంటి ఆల్‌రౌండ‌ర్లు అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ మాక్స్‌వెల్ స్థానంలో ఎవ‌రిని ఆడించాల‌ని ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌ని చెప్పారు.

Quinton de Kock : ఆఖ‌రి ప్ర‌పంచ‌క‌ప్‌లో అద‌ర‌గొడుతున్న డికాక్‌.. నాలుగో సెంచ‌రీ.. రోహిత్ రికార్డును బ్రేక్ చేస్తాడా..?

గాయం తీవ్ర‌మైన‌దా..? కాదా..?

కాగా.. మాక్స్‌వెల్ అయిన గాయం మ‌రీ తీవ్ర‌మైన‌ది కాద‌ని, త్వ‌ర‌గానే కోలుకుంటాడ‌ని అంటున్నారు. సెమీఫైన‌ల్ మ్యాచ్ స‌మ‌యానికి అత‌డు జ‌ట్టుతో క‌లిసే అవ‌కాశం మెండుగా ఉన్న‌ట్లు ప‌లు నివేదిక‌లు చెబుతున్నాయి. కాగా.. ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో మాక్స్ వెల్ అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. ఆరంభ మ్యాచుల్లో త‌ల‌బ‌డిన‌ప్ప‌టికీ ఆ త‌రువాత ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. నెద‌ర్లాండ్స్‌తో జ‌రిగిన మ్యాచులో 40 బంతుల్లోనే సెంచ‌రీ చేసి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లోనే అత్యంత వేగ‌వంత‌మైన శ‌త‌కం బాదిన మొద‌టి ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు.

ఆల్‌రౌండ‌ర్‌గా అద‌ర‌గొడుతున్న మాక్స్‌వెల్ ఆసీస్ విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఆరు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌లో 196 పరుగులు చేసిన మాక్సీ బౌలింగ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఎకానమీ 4.82గా ఉండ‌డం విశేషం.

ODI Rankings : అగ్ర‌స్థానానికి మ‌రింత చేరువ‌గా గిల్‌.. రెండు స్థానాలు ఎగ‌బాకిన రోహిత్‌, కోహ్లీ డౌన్‌