World Cup 2023 IND vs AFG ODI
World Cup 2023 IND vs AFG : వన్డే ప్రపంచకప్‌లో భారత్ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.
273 పరుగుల లక్ష్యాన్ని 35 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (131; 84 బంతుల్లో 16 ఫోర్లు, 5సిక్సర్లు) సూపర్ శతకంతో అఫ్గాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. విరాట్ కోహ్లీ (55; 56 బంతుల్లో 6ఫోర్లు) హాప్ సెంచరీతో రాణించగా.. ఇషాన్ కిషన్ (47 ; 47 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) అర్థశతకాన్ని చేజార్చుకున్నాడు. అఫ్గానిస్థాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు.
రోహిత్ శర్మ అద్భుత ఇన్నింగ్స్‌కు తెరపడింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో రోహిత్ (131; 84 బంతుల్లో 16 ఫోర్లు, 5సిక్సర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 25.4వ ఓవర్‌లో 205 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది.
భారత ఇన్నింగ్స్‌లో సగం ఓవర్లు ముగిశాయి. 25 ఓవర్లకు భారత స్కోరు 202/1. విరాట్ కోహ్లీ (16), రోహిత్ శర్మ (130) లు ఆడుతున్నారు.
రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఇబ్రహీం జద్రాన్ క్యాచ్ అందుకోవడంతో ఇషాన్ కిషన్ (47 ; 47 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) ఔట్ అయ్యాడు. దీంతో 18.4 ఓవర్లలో 156 పరుగుల వద్ద భారత్ మొదటి వికెట్ కోల్పోయింది. 19 ఓవర్లకు టీమ్ఇండియ స్కోరు 158/1. విరాట్ కోహ్లీ (1), రోహిత్ శర్మ (103) లు ఆడుతున్నారు.
ఆసీస్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో డకౌట్ అయిన రోహిత్ శర్మ అఫ్గాన్‌తో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో శతకంతో చెలరేగిపోయాడు. నబీ బౌలింగ్‌లో సింగిల్ తీసి 63 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌తో శతకాన్ని అందుకున్నాడు.
Topping The Charts! ?
Most Hundreds (7️⃣) in ODI World Cups ? Rohit Sharma
Take a bow! ? #CWC23 | #TeamIndia | #INDvAFG | #MeninBlue pic.twitter.com/VlkIlXCwvA
— BCCI (@BCCI) October 11, 2023
భారత ఇన్నింగ్స్‌లో మొదటి 15 ఓవర్లు పూర్తి అయ్యాయి. రోహిత్ దంచికొడుతుండడంతో భారత్ వికెట్ నష్టపోకుండా 130 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (92), ఇషాన్ కిషన్ (31) క్రీజులో ఉన్నారు.
భారత ఇన్నింగ్స్‌లో మొదటి 10 ఓవర్లు పూర్తి అయ్యాయి. రోహిత్ దూకుడుగా ఆడుతుండడంతో భారత్ వికెట్ నష్టపోకుండా 94 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (76), ఇషాన్ కిషన్ (11) క్రీజులో ఉన్నారు.
నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో(7.4వ ఓవర్) ఫోర్ కొట్టిన రోహిత్ శర్మ 30 బంతుల్లో అర్థశతకాన్ని అందుకున్నాడు. కాగా వన్డేల్లో రోహిత్ కు ఇది 53వ అర్థశతకం
FIFTY for Rohit Sharma - his 5⃣3⃣rd in ODIs! ? ?
Talk about leading from the front! ? ?
Follow the match ▶️ https://t.co/f29c30au8u#CWC23 | #TeamIndia | #INDvAFG | #MeninBlue pic.twitter.com/rRV2SRucQJ
— BCCI (@BCCI) October 11, 2023
ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌లు బరిలోకి దిగారు. రోహిత్ తనదైన శైలిలో బౌండరీలు బాదుతూ అఫ్గాన్ బౌలర్లపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తుండగా మరో వైపు ఇషాన్ కిషన్ నిలదొక్కుకునేందుకు ప్రయత్నంలో ఉన్నాడు. 5 ఓవర్లకు భారత స్కోరు 37/0. రోహిత్ శర్మ (31), ఇషాన్ కిషన్ (5) లు ఆడుతున్నారు.
టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో హష్మతుల్లా షాహిదీ (80; 88 బంతుల్లో 8 ఫోర్లు, 1సిక్స్), అజ్మతుల్లా ఒమర్జాయ్ (62; 69 బంతుల్లో 2ఫోర్లు, 4 సిక్సర్లు) లు హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు తీయగా, హార్ధిక్ పాండ్య రెండు, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్‌లు చెరో వికెట్ పడగొట్టారు.
బుమ్రా బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ క్యాచ్ అందుకోవడంతో రషీద్ ఖాన్ (16; 12బంతుల్లో 1ఫోర్, 1సిక్స్) ఔట్ అయ్యాడు. దీంతో 48.1వ ఓవర్‌లో 261 పరుగుల వద్ద అఫ్గానిస్థాన్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది.
బుమ్రా ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. 45వ ఓవర్‌లో రెండో బంతికి నజీబుల్లాను ఔట్ చేసిన బుమ్రా ఆఖరి బంతికి మహ్మద్ నబీ (19; 27 బంతుల్లో 1ఫోర్) పెవిలియన్‌కు చేర్చాడు. 45 ఓవర్లకు అఫ్గాన్ స్కోరు 235/7.
అఫ్గానిస్థాన్ మరో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో కోహ్లీ క్యాచ్ అందుకోవడంతో నజీబుల్లా(2) పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో అఫ్గానిస్థాన్ 44.2వ ఓవర్‌లో 229 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది.
కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో హష్మతుల్లా షాహిదీ (80; 88 బంతుల్లో 8 ఫోర్లు, 1సిక్స్) ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యారు. దీంతో 42.4వ ఓవర్‌లో 225 పరుగుల వద్ద అఫ్గానిస్థాన్ ఐదో వికెట్ కోల్పోయింది.
హష్మతుల్లా షాహిదీ దూకుడుగా ఆడుతున్నాడు. 40 ఓవర్లకు అఫ్గానిస్థాన్ స్కోరు 211/4. హష్మతుల్లా షాహిదీ (70), మహ్మద్ నబీ (9) లు క్రీజులో ఉన్నారు.
హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్ (62; 69 బంతుల్లో 2ఫోర్లు, 4 సిక్సర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 34.2వ ఓవర్‌లో 184 పరుగుల వద్ద అఫ్గానిస్థాన్ నాలుగో వికెట్ కోల్పోయింది.
మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో (31.6వ ఓవర్)లో రెండు పరుగులు తీసి అజ్మతుల్లా ఒమర్జాయ్ 62 బంతుల్లో అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 32 ఓవర్లకు అఫ్గానిస్థాన్ స్కోరు 161/3. అజ్మతుల్లా ఒమర్జాయ్ (50), హష్మతుల్లా షాహిదీ (45) లు ఆడుతున్నారు.
అఫ్గానిస్థాన్ ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లు పూర్తి అయ్యాయి. మూడు వికెట్లు కోల్పోయిన అఫ్గాన్ జట్టు 114 పరుగులు చేసింది. అజ్మతుల్లా ఒమర్జాయ్ (25), హష్మతుల్లా షాహిదీ (25)లు ఆడుతున్నారు.
అఫ్గానిస్థాన్ ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లు పూర్తి అయ్యాయి. మూడు వికెట్లు కోల్పోయిన అఫ్గాన్ జట్టు 83 పరుగులు చేసింది. అజ్మతుల్లా ఒమర్జాయ్ (6), హష్మతుల్లా షాహిదీ (14)లు ఆడుతున్నారు.
శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో రహ్మత్ షా (16; 22 బంతుల్లో 3ఫోర్లు) ఎల్భీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో 13.1వ ఓవర్‌లో 63 పరుగుల వద్ద అఫ్గానిస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది.
హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్ క్యాచ్ అందుకోవడంతో రహ్మానుల్లా గుర్బాజ్ (21; 28 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్) ఔట్ అయ్యాడు. దీంతో 12.4వ ఓవర్‌లో 63 పరుగుల వద్ద అఫ్గానిస్థాన్ రెండో వికెట్ కోల్పోయింది.
అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు ముగిశాయి. వికెట్ నష్టపోయిన అఫ్గానిస్థాన్ 48 పరుగులు చేసింది. రహ్మానుల్లా గుర్బాజ్(20), రహ్మత్ షా (4) లు ఆడుతున్నారు.
అఫ్గానిస్థాన్‌కు భారత పేసర్ బుమ్రా షాకిచ్చాడు. బుమ్రా బౌలింగ్‌లో ఇబ్రహీం జద్రాన్ (22; 28 బంతుల్లో 4 ఫోర్లు) కీపర్ కేఎల్ రాహుల్ క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు. దీంతో 6.4వ ఓవర్‌లో 32 పరుగుల వద్ద అఫ్గానిస్థాన్ జట్టు మొదటి వికెట్ కోల్పోయింది.
అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లు పూర్తి అయ్యాయి. వికెట్ నష్టపోకుండా అఫ్గాన్ జట్టు 19 పరుగులు చేసింది. 5 ఓవర్లకు అఫ్గానిస్థాన్ స్కోరు 19 0. ఇబ్రహీం జద్రాన్ (17), రహ్మానుల్లా గుర్బాజ్(1)లు ఆడుతున్నారు.
భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తున్నారు. దీంతో అఫ్గాన్ బ్యాటర్లు పరుగులు చేయడం కష్టంగా మారింది. 3 ఓవర్లకు అఫ్గానిస్థాన్ స్కోరు 9/0. ఇబ్రహీం జద్రాన్ (7), రహ్మానుల్లా గుర్బాజ్(1)లు ఆడుతున్నారు.
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
? Toss & Team News ?
Afghanistan have elected to bat against the @ImRo45-led #TeamIndia!
1⃣ change in the line-up for India as Shardul Thakur is named in the team.
A look at our Playing XI ?
Follow the match ▶️ https://t.co/f29c30au8u #CWC23 | #INDvAFG | #MeninBlue pic.twitter.com/Vazk9Xon0q
— BCCI (@BCCI) October 11, 2023
రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్ ఉల్ హక్, ఫరూఖల్ హాక్
అఫ్గాన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట ఫీల్డింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి ప్రపంచకప్‌లో విజయపరంపరను కొనసాగించాలని భారత్ భావిస్తోంది. భారత తుది జట్టులో ఓ మార్పు చోటు చేసుకుంది. రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ వచ్చాడు.