World Cup 2023 SA Vs SL ODI : ప్రపంచ‌క‌ప్‌లో శుభారంభం చేసిన ద‌క్షిణాఫ్రికా.. శ్రీలంక‌పై ఘ‌న విజ‌యం

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ద‌క్షిణాఫ్రికా శుభారంభం చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శ్రీలంకతో జ‌రిగిన మ్యాచ్‌లో ఘ‌న విజ‌యాన్ని సాధించింది.

World Cup 2023 SA Vs SL ODI : ప్రపంచ‌క‌ప్‌లో శుభారంభం చేసిన ద‌క్షిణాఫ్రికా.. శ్రీలంక‌పై ఘ‌న విజ‌యం

South Africa beat Sri Lanka

Updated On : October 7, 2023 / 10:21 PM IST

World Cup 2023 SA Vs SL : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ద‌క్షిణాఫ్రికా శుభారంభం చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శ్రీలంకతో జ‌రిగిన మ్యాచ్‌లో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. 429 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన శ్రీలంక 44.5 ఓవ‌ర్ల‌లో 326 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. ఫ‌లితంగా 102 ప‌రుగుల తేడాతో ద‌క్షిణాఫ్రికా గెలుపొందింది. లంక బ్యాట‌ర్ల‌లో కుశాల్ మెండీస్ (76; 42 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స‌ర్లు), చ‌రిత్‌ అస‌లంక (79; 65 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), ధ‌సున్ ష‌న‌క (68; 62 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స‌ర్లు)లు హాఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో గెరాల్డ్ కోయెట్జీ మూడు వికెట్లు తీయ‌గా కేశవ్ మహరాజ్, మార్కో జాన్సెన్ , ర‌బాడ లు త‌లా రెండు, లుంగి ఓ వికెట్‌ ప‌డ‌గొట్టాడు.

ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక స్కోరు..

అంత‌క ముందు మొద‌ట‌ బ్యాటింగ్ చేసిన‌ ద‌క్షిణాఫ్రికా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక స్కోరు న‌మోదు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (100; 84 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లు), వాన్ డ‌ర్ డుసెన్ (108; 110 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచ‌రీలు బాదగా.. ఐడెన్ మార్క్రామ్ (106; 54 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు శ‌త‌కంతో విరుచుకుప‌డ్డాడు. దీంతో ద‌క్షిణాఫ్రికా భారీ స్కోరు చేసింది. లంక బౌల‌ర్ల‌లో మధుశంక రెండు, కాసున్ రజిత, పతిరన, వెల్లలాగె ఒక్కో వికెట్ తీశారు.

Virat Kohli Funny Video: ప్రాక్టీస్ సెషన్ లో విరాట్ కోహ్లీ ఫన్నీ వీడియో వైరల్.. వాటర్ బాయ్ తరహాలో..

డికాక్‌, వాన్ డ‌ర్ డుసెన్ శ‌త‌కాల మోత‌..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ద‌క్షిణాఫ్రికాకు శుభారంభం ద‌క్క‌లేదు. జట్టు స్కోరు 10 పరుగులు వ‌ద్ద‌ బావుమా (8) మధుశంక బౌలింగ్‌లో ఎల్భీగా ఔట్ అయ్యాడు. మ్యాచులో శ్రీలంక సంబురాలు చేసుకున్న క్ష‌ణం ఇదే కావొచ్చు. ఆ త‌రువాత డికాక్, డుసెన్ జోడి నిలకడ‌గా ఆడింది. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ జోడి కుదురుకున్న త‌రువాత‌ జోరుపెంచారు. ఈ క్ర‌మంలో మొద‌ట డుసెన్ 51 బంతుల్లో ఆ త‌రువాత క్వింట‌న్ డికాక్ 61 బంతుల్లో అర్థ‌శ‌త‌కాల‌ను పూర్తి చేసుకున్నారు.

pic @icc twitter

pic @icc twitter

ODI World Cup : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక స్కోరు ఎంతో తెలుసా..? ఏ జ‌ట్టు చేసిందంటే..?

హాఫ్ సెంచ‌రీలు పూరైన త‌రువాత ఒక్క‌సారిగా గేరు మార్చారు. పోటాపోటీగా బౌండ‌రీలు బాదారు. డికాక్ 83 బంతుల్లో డుసెన్ 103 బంతుల్లో శ‌త‌కాల‌ను అందుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 204 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. శ‌త‌కం బాదిన వెంట‌నే డికాక్ ఔట్ అయ్యాడు. మార్క్రామ్ వ‌చ్చి రావ‌డంతో మ‌ధుశంక బౌలింగ్‌లో ఫోర్లు కొట్టి హెచ్చ‌రిక‌లు పంపాడు.

చరిత్ర సృష్టించిన మార్క్రామ్..

ఆ త‌రువాత కూడా అదే జోరును కొన‌సాగిస్తూ 34 బంతుల్లో అర్థ‌శ‌త‌కాన్ని అందుకున్నాడు మార్క్రామ్. హాప్ సెంచ‌రీ త‌రువాత మార్క్రామ్ పెను విధ్వంస‌మే సృష్టించాడు. మ‌రో 15 బంతుల్లో సెంచ‌రీ చేశాడు అంటే అత‌డి ఆట ఎలా సాగిందో అర్థం చేసుకోవ‌చ్చు. మొత్తంగా 49 బంతుల్లోనే సెంచ‌రీ చేసిన మార్క్రామ్ వన్డే ప్రపంచకప్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో శ‌త‌కం బాదిన మొద‌టి ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు ఐర్లాండ్‌ ఆటగాడు కెవిన్ ఓబ్రియన్ (50 బంతులు) పేరిట ఉండేది.

Aiden Markram pic @ ICC Twitter

Aiden Markram pic @ ICC Twitter

Aiden Markram : చ‌రిత్ర సృష్టించిన ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్‌ ఐడెన్ మార్క్రామ్.. ప్ర‌పంచ‌క‌ప్‌ హిస్టరీలో తొలిసారి

ఆఖ‌ర్లో క్లాసెన్ (32; 20 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు), డేవిడ్ మిల్లర్ (39నాటౌట్‌; 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడడంతో ద‌క్షిణాఫ్రికా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక స్కోరును న‌మోదు చేసింది.