Yashasvi Jaiswal : ఐసీసీ అవార్డు రేసులో య‌శ‌స్వి జైస్వాల్‌

భీక‌ర ఫామ్‌లో ఉన్న టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ ఐసీసీ అవార్డు రేసులో నిలిచాడు.

Yashasvi Jaiswal : ఐసీసీ అవార్డు రేసులో య‌శ‌స్వి జైస్వాల్‌

Yashasvi Jaiswal

Jaiswal : భీక‌ర ఫామ్‌లో ఉన్న టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ ఐసీసీ అవార్డు రేసులో నిలిచాడు. ప్ర‌తి నెలా ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డుల‌ను ఐసీసీ అందిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఫిబ్ర‌వ‌రి నెల‌కు సంబంధించిన నామినీస్ జాబితాను విడుద‌ల చేసింది. య‌శ‌స్వి జైస్వాల్‌తో పాటు కివీస్ స్టార్ ఆట‌గాడు కేన్‌ విలియమ్సన్‌, శ్రీలంక ఓపెనర్‌ పథుమ్‌ నిస్సంక లు ఈ జాబితాలో ఉన్నారు. ఫిబ్ర‌వ‌రి నెల‌లో వీరి ప్ర‌ద‌ర్శ‌న‌లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని వీరిని ఐసీసీ నామినేట్ చేసింది.

ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న టెస్టు సిరీస్‌లో జైస్వాల్ 112 స‌గ‌టుతో 560 ప‌రుగులు చేశాడు. ఇందులో వ‌రుస మ్యాచుల్లో డ‌బుల్ సెంచ‌రీలు సైతం ఉన్నాయి. అటు దక్షిణాప్రికా పై మూడు శ‌త‌కాల‌తో రికార్డు నెల‌కొల్పాడు కేన్‌ విలియ‌మ్స‌న్‌. అఫ్గానిస్తాన్‌తో జ‌రిగిన 3 వ‌న్డేల్లో ఓ ద్విశ‌త‌కం, మ‌రో సెంచ‌రీతో 350 కి పైగా ప‌రుగులు చేశాడు ప‌థుమ్‌ నిస్సంక]

KL Rahul : లండ‌న్ నుంచి వ‌చ్చిన కేఎల్ రాహుల్.. ఐపీఎల్ ఆడేందుకేనా?

మ‌హిళ‌ల విభాగంలో..

మ‌హిళ‌ల విభాగానికి వ‌స్తే.. యూఏఈకి చెందిన కవిష ఎగోడగే, ఈషా ఓజా, ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్ లు ఫిబ్రవరి నెలకు సంబంధించి ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌గా నిలిచారు. వీరు ముగ్గురు ఆల్‌రౌండ‌ర్లు కావ‌డం విశేషం. గత నెలలో జరిగిన మ్యాచ్‌ల్లో వీరు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ను చేశారు.

విజేత‌ను ఎలా నిర్ణ‌యిస్తారంటే..?

స్వతంత్ర ఓటింగ్ అకాడమీతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు ఓటింగ్‌ పద్దతిన విజేత‌ను ఎన్నుకుంటారు. వ‌చ్చే వారం విజేత పేర్ల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు.

CSK : ఇలాగైతే సీఎస్‌కే క‌ప్ కొట్ట‌డం క‌ష్ట‌మే!.. ఐపీఎల్ ఆరంభం కాక‌ముందే ఇలా..