రిటైర్ మెంట్ విషయంలో మనస్సు మార్చుకున్న యువరాజ్ సింగ్!

టీమిండియా ఆల్ రౌండర్ యువ రాజ్ సింగ్ మనస్సు మార్చుకున్నాడు. 2019, జూన్ 10వ తేదీన అంతర్జాతీయ క్రికేట్ తో పాటు దేశవాళి ఆటకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా రిటైర్ మెంట్ వెనక్కి తీసుకోవాలని, పంజాబ్ క్రికెట్ తరపున లీగ్ మ్యాచ్ లు ఆడాలని భావిస్తున్నాడు.
రంజీ జట్టుకు సేవలు అవసరమని, యువ ఆటగాళ్లకు మార్గదర్శకుడిగా వ్యవహరించాలని పంజాబ్ క్రికెట్ సంఘం ఇటీవలే యువీని కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…మనస్సు మార్చుకున్న యువీ..రిటైర్ మెంట్ విషయాన్ని వెనక్కు తీసుకొనేందుకు సిద్ధంగా ఉన్నానంటూ.. బీసీసీఐకి లేఖ రాశాడు.
https://10tv.in/honoured-to-have-played-with-ms-dhoni-says-kl-rahul/
దేశవాళి క్రికెట్ ఆడేందుకు అనుమతినివ్వాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, కార్యదర్శి జై షాకు లేఖ రాసినట్లు యువీ తెలిపాడు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇస్తే…విదేశీ లీగ్ ల్లో పాల్గొనేందుకు అవకాశం ఉండదని తెలుస్తోంది.
2000 సంవత్సరంలో అడుగుపెట్టిన యువీ బ్యాట్ తో సత్తా చాటాడు. అటు బౌలర్, ఇటు ఫీల్డర్, బ్యాట్స్ మెన్ గా రాణించి ఆల్ రౌండర్ గా పేరు గడించాడు. 2007 టీ20, 2011 ప్రపంచకప్‌లు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.