Birthday wishes to Balakrishna : సమాజానికి మీ సేవలు స్ఫూర్తి దాయకం.. బాలకృష్ణకు యువరాజ్ సింగ్ బర్త్ డే ట్వీట్

నందమూరి బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, అభిమానులు గ్రీటింగ్స్ చెబుతున్నారు. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బాలకృష్ణకు ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

Birthday wishes to Balakrishna : సమాజానికి మీ సేవలు స్ఫూర్తి దాయకం.. బాలకృష్ణకు యువరాజ్ సింగ్ బర్త్ డే ట్వీట్

Yuvraj Singh Birthday Wishes for Balakrishna

Updated On : June 10, 2023 / 12:02 PM IST

Yuvraj Singh Birthday Wishes Bala krishna : నందమూరి నటసింహం బాలకృష్ణ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అనేకమంది రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా అనేకమంది సెలబ్రిటీలు, అభిమానులు విష్ చేస్తున్నారు. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బాలకృష్ణకు ట్విట్టర్‌లో శుభాకాంక్షలు చెప్పారు.

Balakrishna : ఇక నుంచి బాలకృష్ణ ‘నటసింహ’ కాదు.. బాలయ్య బిరుదు మారింది.. ఏంటో తెలుసా?

బాలయ్యబాబు ఈరోజు 63వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అనేకమంది అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆయనకు ట్విట్టర్ వేదికగా విషెస్ చెప్పారు. ‘హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నందమూరి బాలకృష్ణ సార్.. క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ ద్వారా సమాజానికి అంకిత భావంతో మీరు చేస్తున్న సేవలు స్ఫూర్తి దాయకం. మీకు ఈ సంవత్సరం అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.

WTC Final 2023: బాలకృష్ణ డైలాగులు చెబుతూ అదరగొట్టేసిన స్టీవ్ స్మిత్.. వీడియో

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కి చైర్మన్‌గా ఉంటూ బాలకృష్ణ అనేక సేవలు అందిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ఇక యువరాజ్ సింగ్ 2011 లో క్యాన్సర్ బారిన పడి ట్రీట్మెంట్ తీసుకుని పూర్తి ఆరోగ్యంతో కోలుకున్నారు.