Yuzvendra Chahal: టీమిండియాలోకి రీ ఎంట్రీపై చాహల్ ఆసక్తికర కామెంట్స్
తాము ఒకరికొకరం సమన్వయం చేసుకునేవాళ్లమని చెప్పాడు.

Yuzvendra Chahal
భారత క్రికెటర్లు ప్రస్తుతం ఐపీఎల్ 2025లో ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గురించి లెగ్ స్పిన్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అలాగే, టీమిండియాలోకి రీ ఎంట్రీ గురించి కూడా మాట్లాడాడు.
టీమిండియాలోకి రీ ఎంట్రీ అనేది తన చేతుల్లో లేదని చాహల్ చెప్పాడు. దాని గురించి తాను ఆలోచించబోనని తెలిపాడు. కుల్‌దీప్ ఇప్పుడు వరల్డ్‌లోనే నంబర్ 1 మణికట్టు స్పిన్నర్ అని చెప్పాడు.
Also Read: మళ్లీ ఏమైంది సామ్? ఆసుపత్రిలో సమంత.. ఫొటో వైరల్
ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కుల్దీప్ యాదవ్ అద్భుతం బౌలింగ్ చేస్తున్నాడని తెలిపాడు. అతడితో కలిసి బౌలింగ్ చేయడమంటే తనకు చాలా ఇష్టమని అన్నాడు. కుల్దీప్‌కు, తనకు మధ్య మంచి అనుబంధం ఉందని తెలిపాడు.
కుల్దీప్‌తో బౌలింగ్ చేయడం చాలా ఫన్నీగా ఉంటుందని చెప్పాడు. ఇద్దరి బౌలింగ్ ఒకే రకంగా ఉంటుందని అన్నాడు. తామిద్దరికీ అటాకింగ్ బౌలింగ్ బాగా నచ్చుతుందని తెలిపాడు. తాము ఒకరికొకరం సమన్వయం చేసుకునేవాళ్లమని చెప్పాడు.
ఐపీఎల్ 2025లో కుల్దీప్ యాదవ్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. ఇక యుజ్వేంద్ర చాహల్ పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ మ్యాచులు మార్చి 22 నుంచి ప్రారంభం కానున్నాయి. క్రికెటర్లు ఐపీఎల్ కోసం ప్రాక్టీసులో బిజీ బిజీగా ఉన్నారు.