Best Smartphones : అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్.. సరసమైన ధరకే టాప్ 3 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. ఫీచర్లు మాత్రం కేక.. ఇప్పుడే కొనేసుకోండి!
Best Smartphones : అమెజాన్ పండగ సేల్ సందర్భంగా అత్యంత ఆకర్షణీయమైన ధరకు మూడు స్మార్ట్‌ఫోన్లు లభిస్తున్నాయి. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.

Best Smartphones
3 Best Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి అదిరిపోయే ఆఫర్.. పండగ సీజన్ సేల్‌లో అతి తక్కువ ధరలోనే అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ సమయంలో ఆకర్షణీయమైన ఫీచర్లతో సరసమైన ధరలో కొత్త ఫోన్ కొనాలని అనుకుంటే ఇదే బెస్ట్ టైమ్. కేవలం రూ. 7వేల లోపు ధరలో టాప్ 3 బెస్ట్ స్మార్ట్ ఫోన్లు లభ్యమవుతున్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్లలో 6,300mAh బ్యాటరీ ప్యాక్, 8GB వరకు ర్యామ్, అద్భుతమైన 50MP కెమెరా (3 Best Smartphones) సెటప్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో డిస్కౌంట్ తర్వాత ఈ 3 స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి పూర్తి ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.. అవేంటో ఓసారి లుక్కేయండి.
1. రియల్‌మి C71 :
రియల్‌మి C71 ఫోన్ 4G కనెక్టివిటీతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. ఈ ఫోన్ 7.94mm స్లిమ్ డిజైన్‌తో వస్తుంది. 6,300mAh లాంగ్ బ్యాటరీ ప్యాక్ అందిస్తుంది. సాధారణ వినియోగంతో 2 రోజుల బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది.
ఈ రియల్‌మి ఫోన్ UNISOC T7 250 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. రోజువారీ వినియోగానికి భారీ గేమింగ్‌లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.745-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. 25శాతం తగ్గింపుతో సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 6,790కు కొనుగోలు చేయొచ్చు.
2. లావా బోల్డ్ N1 ప్రో :
లావా బోల్డ్ N1 ప్రో ఫోన్ 4GB ర్యామ్ ప్లస్ 4GB ఎక్స్‌టెండెడ్ ర్యామ్ టెక్నాలజీతో వస్తుంది. మొత్తం 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. ఈ ఫోన్ 6.67-అంగుళాల పెద్ద HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. IP54 డస్ట్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. 120Hz స్మూత్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది.
బ్యాక్ సైడ్ 50MP ఏఐ ట్రిపుల్ కెమెరా సెటప్ పొందుతారు. అయితే, ఫ్రంట్ సైడ్ 8MP కెమెరా కలిగి ఉంది. మీరు ఛార్జర్‌ను విడిగా కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. ఫోన్ బాక్స్‌లోనే వస్తుంది. 21శాతం తగ్గింపుతో అమెజాన్ సేల్‌లో ఈ లావా ఫోన్‌ను కేవలం రూ. 6,599కు కొనేసుకోవచ్చు.
3. శాంసంగ్ గెలాక్సీ M05 :
శాంసంగ్ గెలాక్సీ M05 ఫోన్ 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఆకర్షణీయమైన ఫొటోల కోసం 50MP హై-రిజల్యూషన్ బ్యాక్ కెమెరా కలిగి ఉంది. అయితే ఫ్రంట్ సైడ్ అద్భుతమైన సెల్ఫీల కోసం 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఫ్రంట్, బ్యాక్ కెమెరాల కోసం FHD క్వాలిటీతో ఈజీగా రికార్డ్ చేయవచ్చు.
ఈ శాంసంగ్ ఫోన్‌లో భారీ 5,000mAh బ్యాటరీ కలిగి ఉంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌తో త్వరగా ఛార్జ్ చేయవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ సెకండ్ జనరేషన్ ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్‌లు, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ సపోర్టు ఇస్తుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో 38శాతం తగ్గింపు తర్వాత ఈ శాంసంగ్ ఫోన్ కేవలం రూ. 6,249కి సొంతం చేసుకోవచ్చు.