Top AI Courses Online : 2026లో AI కోర్సు నేర్చుకుంటారా? ఆన్‌లైన్‌లో టాప్ 5 AI కోర్సులు మీకోసం.. మీ స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకోండి!

Top AI Courses Online : కొత్త ఏఐ కోర్సులు నేర్చుకుంటున్నారా? 2026లో మీ స్కిల్స్ అప్ గ్రేడ్ చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో టాప్ 5 ఏఐ కోర్సులు అందుబాటులో ఉన్నాయి..

Top AI Courses Online : 2026లో AI కోర్సు నేర్చుకుంటారా? ఆన్‌లైన్‌లో టాప్ 5 AI కోర్సులు మీకోసం.. మీ స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకోండి!

Top AI Courses Online

Updated On : December 7, 2025 / 3:57 PM IST

Top AI Courses Online : కొత్తగా ఏఐ కోర్సు నేర్చుకోవాలని అనుకుంటున్నారా? ఏఐ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. రోజురోజుకీ కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. ప్రస్తుత టెక్నాలజీకి తగినట్టుగా అప్‌డేట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఏఐ కోర్సులకు ఫుల్ డిమాండ్ పెరిగింది. చాలామంది ఏఐ కోర్సులు నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఏఐ మార్కెట్ ట్రెండ్‌కు తగినట్టుగా ఎప్పటికప్పుడూ కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నారు. రాబోయే ఏడాది 2026లో ఏఐకి సంబంధించి కొత్త ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఇప్పటినుంచి ఏఐ కోర్సులను నేర్చుకోవడం ఎంతైనా మంచిది. మీరు కూడా ఏఐ కోర్సులను నేర్చుకోవాలనుకుంటే మీకోసం ఆన్‌లైన్‌లో టాప్ 5 ఏఐ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఏఐ కోర్సు ఎంచుకుని ఫుల్‌గా నేర్చుకోండి.

​Coursera : జనరేటివ్ AI ఇంట్రడక్షన్ (ఉచితం) :
కోర్సెరాలో “Introduction to Generative AI” కోర్సులో చేరవచ్చు. 12 వేర్వేరు భాషలలో అందుబాటులో ఉంది. బిగినర్ల కోసమే ఈ కోర్సు అందిస్తోంది. ముందస్తు ఎక్స్ పీరియన్స్ అవసరం లేదు. దీనికి నిర్ణీత వ్యవధి లేదు. మీ సొంతంగా కోర్సును పూర్తి చేయవచ్చు. పాఠ్యాంశాల్లో 9 వీడియోలు, 4 అసైన్‌మెంట్‌లు ఉంటాయి. ప్రతి వీడియో గరిష్టంగా 2 నుంచి 3 నిమిషాలు ఉంటుంది. మీరు మొత్తం కోర్సును దాదాపు 1 గంట నుంచి 2 గంటల్లో పూర్తి చేయవచ్చు.

​Udemy : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోర్సులు (రూ. 1,178) :
ఉడెమీ (​Udemy)లో ఇంట్రో టు ఏఐ ఏజెంట్స్ అండ్ ఏజెంట్టిక్ ఏఐ కోర్సును అందిస్తుంది. ఏఐ ఏజెంట్లు ఎలా పనిచేస్తారు? టెక్నాలజీని ఎలా వాడుకోవాలో అర్థం చేసుకోవచ్చు. ఈ కోర్సు కేవలం ఇంగ్లీష్‌లోనే అందుబాటులో ఉంది. 52 లెక్చరర్‌తో 9 సెక్షన్లు ఉన్నాయి. మొత్తం 2 గంటల 10 నిమిషాలు ఉంటుంది. అదనంగా, “The AI Engineer Course 2025” పేరుతో కోర్సు ఉంది. 143 డౌన్‌లోడబుల్ రీసోర్సెస్, 107 కోడింగ్ ఎక్సర్ సైజెస్, 29 గంటల 35 నిమిషాలతో ఫుల్ ఏఐ ఇంజనీర్ బూట్‌క్యాంప్ కలిగి ఉంది.

Read Also : Flipkart Buy Buy Sale : కొత్త స్మార్ట్‌టీవీ కావాలా? 55-అంగుళాల స్మార్ట్‌టీవీలపై బిగ్ డిస్కౌంట్లు.. ఫ్లిప్‌కార్ట్‌లో సగం ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు!

​upGrad : జనరేటివ్ AI ఇంట్రడక్షన్ (ఉచితం) :

కేవలం 2 గంటల్లో అప్‌గ్రాడ్ అందించే ఈ ఏఐ కోర్సు మీకు ఏఐ ఆధారిత డేటా-టు-కంటెంట్ జనరేషన్ టెక్నిక్‌లను అందిస్తుంది. మీకు క్విక్ డిజైన్, ఆప్టిమైజేషన్‌ను నేర్పుతుంది. కొత్తగా నేర్చుకునేవారికి అద్భుతమైన ఏఐ కోర్సు ఇది. LLMs, GenAI, కోడింగ్ ఆటోమేషన్ మరిన్నింటి గురించి నేర్చుకోవాలని అనుకునే వారికి బెస్ట్ కోర్సు.

మైక్రోసాఫ్ట్ : అజూర్‌లో ఏఐ ఇంట్రడక్షన్ (ఉచితం) :
మైక్రోసాఫ్ట్ అజూర్ సర్వీసులతో ఏఐ కోర్సును అందిస్తోంది. అజూర్ ఏఐ ఫండమెంటల్స్, అజూర్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవచ్చు. మాడ్యూల్‌లను నేర్చుకునేందుకు వివిధ ఎక్స్‌రసైజులను అందిస్తుంది. మీరు ఒక రోజులో సులభంగా పూర్తి చేయవచ్చు. ఎందుకంటే 9 యూనిట్లను కలిగి ఉంటుంది. ఒక్కొక్కటి గరిష్టంగా 5 నిమిషాల నిడివి గల వీడియోలు ఉన్నాయి.

​యూఎన్ అకాడమీ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు (యూఎన్ అకాడమీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌) :
అనాకాడమీ 27 లెసెన్స్ కలిగి ఉంటుంది. 2 వారాల కన్నా తక్కువ సమయంలో AI కోర్సును పూర్తి చేయొచ్చు. ఈ కోర్సుతో మీరు GATE DA పరీక్షకు రెడీ కావచ్చు. ఇంకా, ఇందులో మీరు అవగాహన కోసం వివిధ వ్యూహాలు, టిప్స్, ట్రిక్స్, ఐడియాలు, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ కోర్సు హిందీ, ఇంగ్లీష్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. యూఎన్ అకాడమీ ఐకానిక్ ప్లాన్ 36 నెలల కాలానికి రూ. 1,589 ధరకు అందుబాటులో ఉంది.