Best Camera Phones : ఫొటోగ్రఫీ అంటే మీకు ఇష్టమా? ఈ నెలలో బెస్ట్ కెమెరా మొబైల్ ఫోన్లు మీకోసం.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

Best Camera Phones : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ఫొటోలు తీయడం మీ హాబీనా.. అయితే ఇది మీకోసమే.. భారత మార్కెట్లో 8 బెస్ట్ కెమెరా మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఓసారి లుక్కేయండి.

Best Camera Mobile Phones

Best Camera Phones : కొత్త మొబైల్ ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం భారత మార్కెట్లో అద్భుతమైన ఫీచర్లతో అనేక స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. చాలామంది వినియోగదారులు ఫీచర్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ఫీచర్లు బాగుంటే చాలు.. ఆ ఫోన్ ఎంతైనా కొనేస్తుంటారు. ప్రధానంగా కెమెరా ఫీచర్లకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు.

అందుకే మార్కెట్లో కెమెరా ఫీచర్లు మంచిగా ఉన్నాయంటే కొనేందుకు కొంచెం కూడా వెనకాడరు. మీరు కూడా అద్భుతమైన కెమెరా ఫీచర్లు కలిగిన హైఎండ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ల కోసం చూస్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. ప్రస్తుతం మార్కెట్లో మార్చిలో లభ్యమయ్యే రూ. 60వేల లోపు ధరలో బెస్ట్ కెమెరా మొబైల్ ఫోన్ల జాబితాను అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని వెంటనే కొనేసుకోండి.

Read Also : Best Selling ACs 2025 : కొత్త ఏసీ కొంటున్నారా? అమెజాన్‌లో అమ్ముడయ్యే టాప్ 10 బెస్ట్ ఏసీలు మీకోసం.. నచ్చిన ఏసీని ఇంటికి తెచ్చుకోండి!

వన్‌ప్లస్ 13ఆర్ :
అమెజాన్‌లో వన్‌ప్లస్ 13ఆర్ ఫోన్ ధర రూ. 42,988కి లభ్యమవుతుంది. ఇందులో 6.78 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్‌సెట్ ఉన్నాయి. ఈ ఫోన్ 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 50ఎంపీ టెలిఫొటో లెన్స్, 8ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్, 16ఎంపీ సింగిల్ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. మీకు నచ్చిన విధంగా అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు.

రియల్‌మి GT 7ప్రో​:
అమెజాన్‌లో ఈ రియల్‌‌మి జీటీ 7 ప్రో ధర రూ. 54,999కు లభ్యమవుతుంది. రియల్‌మి జీటీ 7 ప్రోలో 6.78-అంగుళాల అమోల్డ్, 120Hz రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ఉన్నాయి. 50ఎంపీ బ్యాక్ ట్రిపుల్ కెమెరా, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 50ఎంపీ టెలిఫోటో లెన్స్, 8ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్, 16ఎంపీ సింగిల్ ఫ్రంట్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. హైక్వాలిటీ ఫొటోలు, వీడియోలను క్యాప్చర్ చేసేందుకు బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు.

ఐక్యూఓ 13 :
ఐక్యూ 13లో 6.82-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 144Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. అమెజాన్‌లో ఈ ఫోన్ ధర రూ. 54,998కు అందుబాటులో ఉంది. వైడ్ లెన్స్‌తో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 50ఎంపీ టెలిఫోటో లెన్స్, 50ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపీ సెల్ఫీ కెమెరాను ఫోటోగ్రఫీ యూజర్లకు బెస్ట్ ఆప్షన్ అందిస్తుంది.

ఒప్పో రెనో 13 ప్రో :
జియోమార్ట్‌లో ఈ ఒప్పో రెనో 13 ప్రో ఫోన్ రూ.54,999 ధరకు లభిస్తుంది. ఒప్పో ఫోన్ 6.83-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 50ఎంపీ టెలిఫోటో లెన్స్, 8ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్‌తో వస్తుంది. 50ఎంపీ సింగిల్ సెల్ఫీ కెమెరా సెల్ఫీలతో క్లిక్ చేయడానికి చాలా బాగుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 :
అమెజాన్‌లో రూ.50,600కి అందుబాటులో ఉన్న శాంసంగ్ గెలాక్సీ S24 మోడల్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.2-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 10ఎంపీ టెలిఫోటో లెన్స్, సెల్ఫీల విషయానికి వస్తే 12ఎంపీ సింగిల్ ఫ్రంట్ కెమెరా సెటప్ కలిగి ఉంది.

వివో వి40 ప్రో :
వివో V40 ప్రోలో 6.78-అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ ఆఫ్ 9200 ప్లస్ ప్రాసెసర్, హై రిజల్యూషన్ ఫోటో, వీడియోల కోసం బ్యాక్, ఫ్రంట్ 50ఎంపీ వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. 80డబ్ల్యూ వరకు ఛార్జింగ్ పవర్‌కు సపోర్టు ఇచ్చే భారీ 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.49,999కు అందుబాటులో ఉంది.

గూగుల్ పిక్సెల్ 8A :
గూగుల్ పిక్సెల్ 8a ఫోన్ 6.1-అంగుళాల డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. గూగుల్ టెన్సర్ G3 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్ 64ఎంపీ ప్రైమరీ కెమెరా, 13ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్, అల్ట్రావైడ్ లెన్స్‌తో 13ఎంపీ సింగిల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఫొటోలను క్యాప్చర్ చేసేందుకు అద్భుతమైన ఆప్షన్. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ పిక్సెల్ ఫోన్ ధర రూ. 37,999కు అందుబాటులో ఉంది.

Read Also : Top-selling iPhones : అమెజాన్‌లో అదిరే సేల్స్.. ఐఫోన్ 13పై ఆకర్షణీయమైన ఆఫర్లు.. టాప్ సెల్లింగ్ ఐఫోన్ల లిస్టు మీకోసం.. ఓ లుక్కేయండి!

ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్​:
ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 49,999 ధరకు లభిస్తుంది. ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ 6.9-అంగుళాల ఫోల్డబుల్ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 8020 చిప్‌సెట్‌ను అందిస్తుంది. ఇందులో 50ఎంపీ బ్యాక్ కెమెరా, 50ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్, వైడ్ లెన్స్‌తో 50ఎంపీ సింగిల్ సెల్ఫీ కెమెరా సెటప్ ఉంటుంది. తద్వారా సెల్ఫీలు ఆకర్షణీయంగా క్యాప్చర్ చేయొచ్చు.