BAT BMS App : ఈసారి ఏటీఎంలు ఆన్-ఆఫ్ చేస్తున్న BAT BMS యాప్..? వైరల్ వీడియో వెనుక అసలు స్టోరీ ఇదే!
BAT BMS App : ఈ-రిక్షాలను కంట్రోల్ చేసిన బ్యాట్ బీఎంఎస్ యాప్ తరహాలో మరో కొత్త యాప్ ఇప్పుడు ఏటీఎంలను ఆన్ లేదా ఆఫ్ చేస్తుందంటూ ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో నిజమెంతా?
BAT BMS App
BAT BMS App : అయ్య బాబోయ్.. బ్యాట్ బీఎంఎస్ యాప్ మళ్లీ వచ్చిందా? ప్రభుత్వం బ్లాక్ చేసిందిగా.. అయినా ఈ-రిక్షాలను ఆపే యాప్ పోయిందిలే అనుకుంటే.. ఈసారి ఏటీఎంలను ఆన్ ఆఫ్ చేసే మరో యాప్ టెన్షన్ పుట్టిస్తోంది. ఇటీవల దేశవ్యాప్తంగా ఈ-రిక్షాలను రిమోట్‌గా ఆపేస్తున్న వీడియోలు వైరల్ అవ్వడంతో పెద్దఎత్తున చర్చకు దారితీశాయి. దీనికి BAT BMS అనే చైనీస్ యాప్ పేరు ఎక్కువగా వినిపించింది.
అసలు లిథియం బ్యాటరీలను మానిటరింగ్ చేసేందుకు రూపొందించిన ఈ యాప్‌ను కొందరు దుర్వినియోగం చేసి ఈ-రిక్షాల బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ (BMS)తో కనెక్ట్ అయి వాహనాలను నిలిపివేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం బ్యాట్ బీఎంఎస్ యాప్‌ను బ్లాక్ చేసింది. అలాగే గూగుల్ ప్లో స్టోర్, యాపిల్ స్టోర్ నుంచి తొలగించాల్సిందిగా ఆదేశాలు కూడా జారీ చేసింది.
Read Also : E20 ethanol Myths : E20 పెట్రోల్ అద్భుతం.. ఆహా.. ఓహో అంటున్న ప్రభుత్వం.. అవన్నీ నమ్మొద్దని విజ్ఞప్తి!
ఇక సమస్య లేనట్టే అనుకుంటే.. ఇప్పుడు మరో యాప్ బెంబేలిత్తిస్తోంది. ఈ కొత్త యాప్ వీడియో సోషల్ మీడియాలో తెగ్ వైరల్ అవుతోంది. ఇందులో ఒక వ్యక్తి మొబైల్ యాప్ ద్వారా ఏటీఎంలను రిమోట్‌గా ఆన్, ఆఫ్ చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ముఖ్యంగా, ఆ యాప్ యూజర్ ఇంటర్ఫేస్ బ్యాట్ బీఎంఎస్ మాదిరిగా ఉండటంతో మళ్లీ యాప్ ఎంట్రీ వచ్చిందా ఏంటి అనే కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఏటీఎం కంట్రోలింగ్‌పై నో క్లారిటీ :
వాస్తవానికి, కీలక విషయం తప్పక గుర్తుంచుకోవాలి. ఇప్పటివరకు ఈ వైరల్ వీడియో రియల్‌గా ఏటీఎంలను హ్యాక్ చేసి కంట్రోల్ చేస్తుందనడానికి ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. అలాగే వీడియోలో కనిపిస్తున్న యాప్ బ్యాట్ బీఎంఎస్ యాప్ లేదా అదే తరహా ఇంటర్ఫేస్తో రూపొందించిన మరో అప్లికేషన్నా అన్నది కూడా క్లారిటీ లేదు.
బ్యాటరీలు, ఏటీఎంలు, స్మార్ట్ డివైజ్‌లు, ఇండస్ట్రీ మిషన్స్ వంటి అనేక సిస్టమ్స్ ఇప్పుడు మొబైల్ యాప్‌లు, బ్లూటూత్, ఇంటర్నెట్ ద్వారా రన్ అవుతుంటాయి. ఇలాంటి లీగల్ మానిటరింగ్ టూల్స్ సరైన సేఫ్టీ లేకుంటే అవే సైబర్ దుర్వినియోగానికి మార్గం అయ్యే అవకాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ-రిక్షా ఘటన అనంతరం ఇప్పుడు ఏటీఎంల వీడియో కూడా వైరల్ అవ్వడంతో రోజువారీ జీవితంలో వాడే స్మార్ట్ సిస్టమ్స్ ఎంతవరకు సేఫ్ అనే చర్చ మరోసారి మొదలైంది. వైరల్ వీడియోల కన్నా వాటి వెనుక ఉన్న సైబర్ భద్రతా లోపాలను వెంటనే గుర్తించి పటిష్టమైన చర్యలు తీసుకోకుంటే భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
