Airtel Mobile Tariff Hike : జియో బాటలో ఎయిర్‌టెల్.. మొబైల్ టారిఫ్ ఛార్జీలు పెంపు.. కొత్త ప్లాన్ల ధరలివే..!

Airtel Mobile Tariff Hike : భారతీ ఎయిర్‌టెల్ కూడా జియో బాటలోనే నడుస్తోంది. కొత్తగా మొబైల్ టారిఫ్ ధరలను 10-21 శాతం పెంపును ఎయిర్‌టెల్ ప్రకటించింది.

Airtel Mobile Tariff Hike : జియో బాటలో ఎయిర్‌టెల్.. మొబైల్ టారిఫ్ ఛార్జీలు పెంపు.. కొత్త ప్లాన్ల ధరలివే..!

Airtel announces mobile tariff hike ( Image Source : Google )

Airtel Mobile Tariff Hike : మొబైల్ వినియోగదారులకు టెలికం కంపెనీలు వరుసగా షాకులు ఇస్తున్నాయి. రెండున్నరేళ్ల తర్వాత టెలికం సంస్థలు మొబైల్ వినియోగదారులపై భారాన్ని మోపాయి. ఇప్పటికే టెలికం దిగ్గజం రిలయన్స్ జియో మొబైల్ టారిఫ్ ధరలు భారీగా పెంచుతున్నట్టు ప్రకటించగా.. తాజాగా మరో టెలికం దిగ్గజమైన భారతీ ఎయిర్‌టెల్ కూడా జియో బాటలోనే నడుస్తోంది. కొత్తగా మొబైల్ టారిఫ్ ధరలను 10-21 శాతం పెంపును ఎయిర్‌టెల్ ప్రకటించింది. అయితే, కొత్త మొబైల్ ఛార్జీల ధరలు వచ్చే జూలై 3 నుంచి అమల్లోకి రానున్నాయని ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Read Also : Jio Subscribers : తెలుగు రాష్ట్రాల్లో జియో జోరు.. కొత్తగా 1.56 లక్షలకు పైగా యూజర్లు..!

రిలయన్స్ జియో మొబైల్ టారిఫ్‌లను 12 శాతం నుంచి 27 శాతం పెంచుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. బడ్జెట్ సవాలుగా ఉన్న వినియోగదారులపై ఎలాంటి భారం లేకుండా ఉండేలా ఎంట్రీ-లెవల్ ప్లాన్‌లపై ధరల పెరుగుదల (రోజుకు 70 పైసల కంటే తక్కువ) ఉందని సునీల్ మిట్టల్ నేతృత్వంలోని టెలికాం సంస్థ ఈ సవరణను ప్రకటించింది.

మొబైల్ టారిఫ్‌లు దేశంలోని టెల్కోలకు ఆర్థికంగా మొబైల్ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ARPU) రూ. 300 కన్నా ఎక్కువగా ఉండాలని భారతీ ఎయిర్‌టెల్ పేర్కొంది. ఈ స్థాయి ఏఆర్‌పీయూ నెట్‌వర్క్ టెక్నాలజీ, స్పెక్ట్రమ్‌లో అవసరమైన గణనీయమైన పెట్టుబడులను పెంచుతుందని టెల్కో భావిస్తోంది.

అన్‌లిమిటెడ్ వాయిస్ ప్లాన్‌లలో ఎయిర్‌టెల్ దాదాపు 11 శాతం టారిఫ్‌లను పెంచింది. తదనుగుణంగా టారిఫ్ రేట్లు రూ.179 నుంచి రూ.199కి సవరించింది. అదేవిధంగా, రూ.455 నుంచి రూ.509కి, రూ.1,799 నుంచి రూ.1,999కి పెంచినట్టు పేర్కొంది. రోజువారీ డేటా ప్లాన్ కేటగిరీలో రూ.479 ప్లాన్ రూ.579కి (20.8 శాతం) పెరిగింది.

మొబైల్ ఆపరేటర్ల నుంచి మొబైల్ టారిఫ్ పెంపు 10వ స్పెక్ట్రమ్ వేలం తర్వాత అమల్లోకి వస్తుంది. డిసెంబర్ 2021లో కూడా జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలు మొబైల్ సర్వీసు ధరలను 20శాతం పెంచగా, 2019లో 20శాతం నుంచి 40శాతం మేర పెంచాయి.

Read Also : Reliance Jio Tariff Hikes : జియో యూజర్లకు షాక్.. భారీగా పెరిగిన టారిఫ్ ధరలు.. కొత్త ప్లాన్ల వివరాలివే..!