Amazon Black Friday Sale : అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్.. స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం వరకు తగ్గింపు ఆఫర్లు.. డోంట్ మిస్!

Amazon Black Friday Sale : ఈ సేల్ సమయంలో కస్టమర్‌లు స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, గృహోపకరణాలు, గేమింగ్ కన్సోల్‌లు, ఫ్యాషన్ వంటి అనేక రకాల వస్తువులపై అద్భుతమైన డిస్కౌంట్లను పొందవచ్చు.

Amazon Black Friday Sale : అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్.. స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం వరకు తగ్గింపు ఆఫర్లు.. డోంట్ మిస్!

Amazon Black Friday Sale Now Live in India

Updated On : November 30, 2024 / 12:12 AM IST

Amazon Black Friday Sale : అమెజాన్ ఇండియా మొట్టమొదటి బ్లాక్ ఫ్రైడే సేల్‌ను ప్రకటించింది. నవంబర్ 28 అర్ధరాత్రి నుంచి సేల్ అందుబాటులోకి వచ్చింది. ఈ సేల్ సమయంలో కస్టమర్‌లు స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, గృహోపకరణాలు, గేమింగ్ కన్సోల్‌లు, ఫ్యాషన్ వంటి అనేక రకాల వస్తువులపై అద్భుతమైన డిస్కౌంట్లను పొందవచ్చు.

బ్యూటీ ప్రొడక్టులతో పాటు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లతో చేసిన లావాదేవీలపై ఇన్‌స్టంట్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లను పొందవచ్చు. అనేక ప్రముఖ బ్యాంకులతో భాగస్వామ్యం కలిగి ఉంది. అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ డిసెంబర్ 2న ముగుస్తుంది.

అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2024 :
అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా 5జీలో అత్యంత ముఖ్యమైన డీల్స్ ఒకటి. ఈ హ్యాండ్‌సెట్ అసలు ధర రూ. 1,24,999 అయితే, ఆఫర్ ద్వారా రూ. 74,999 తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇ-కామర్స్ దిగ్గజం ఆపిల్, ఐక్యూ, వన్‌ప్లస్, రియల్‌మి, రెడ్‌మి, టెక్నో వంటి ప్రముఖ బ్రాండ్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం వరకు తగ్గింపుతో ఆఫర్‌లను అందిస్తోంది.

ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ (M1, 2020)లో మరో ముఖ్యమైన డీల్ అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్ జాబితాలో ధర రూ. 89,900 అయితే, ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్ ఫారంలో రూ. 59,990 ధరతో అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు 65 శాతం వరకు తగ్గింపుతో గృహోపకరణాలు, స్మార్ట్ టీవీలను పొందవచ్చు.

అలాగే, ప్లేస్టేషన్ 5 ఫ్లాట్ డిస్కౌంట్ రూ. 7,500కు పొందవచ్చు. అమెజాన్ బ్రాండ్‌ల ఉత్పత్తులను బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో కనీసం 50 శాతం ధర తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ రోబోట్ వాక్యూమ్ క్లీనర్ల వంటి ప్రీమియం కిచెన్ అప్లియన్సెస్‌పై కనీసం 50 శాతం తగ్గింపును అమెజాన్ అలెక్సా, ఫైర్ టీవీ డివైజ్‌లపై 25 శాతం వరకు తగ్గింపును కూడా అందిస్తుంది.

ధరల తగ్గింపుతో పాటు, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, వన్ కార్డ్ వంటి ప్రముఖ బ్యాంకుల నుంచి ఎంపిక చేసిన డెబిట్, క్రెడిట్ కార్డ్‌లతో కొనుగోలుదారులు 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చని అమెజాన్ తెలిపింది. అమెజాన్ ప్రైమ్ సభ్యులు అమెజాన్ కో-బ్రాండెడ్ కార్డ్‌లతో జరిపే లావాదేవీలపై ఫ్లాట్ 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

Read Also : iPhone 16 Discount : విజయ్ సేల్స్‌లో ఆపిల్ ఐఫోన్ 16పై అదిరే డిస్కౌంట్.. కొత్త ధర ఎంతంటే?