Amazon Electronics Sale : అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ఫెస్టివల్ సేల్.. వన్‌ప్లస్ 11ఆర్, వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్లపై భారీ డిస్కౌంట్..!
Amazon Electronics Festival Sale : ప్రస్తుతం అమెజాన్‌లో వన్‌ప్లస్ 11ఆర్ రూ. 28,999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ వాస్తవానికి భారత మార్కెట్లో రూ. 39,999 ధర ట్యాగ్‌తో వస్తుంది.

Amazon Electronics Festival sale starts_ Discount on OnePlus 11R, OnePlus Nord 4 and more
Amazon Electronics Festival Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కొత్త ఎలక్ట్రానిక్స్ ఫెస్టివల్ సేల్ ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 10 వరకు కొనసాగుతుంది. అమెజాన్ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ నార్డ్ 4, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్, వన్‌ప్లస్ 11ఆర్ ఫోన్ వంటి అనేక వన్‌ప్లస్ ఫోన్‌లపై డిస్కౌంట్‌లను అందిస్తోంది. ఇతర బ్రాండ్‌ల నుంచి కూడా ఫోన్లు ఉన్నప్పటికీ, వన్‌ప్లస్ ఫోన్‌లలో అందుబాటులో ఉన్న డీల్‌లను ఓసారి పరిశీలిద్దాం..
ప్రస్తుతం అమెజాన్‌లో వన్‌ప్లస్ 11ఆర్ రూ. 28,999 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ వాస్తవానికి భారత మార్కెట్లో రూ. 39,999 ధర ట్యాగ్‌తో వస్తుంది. ఈ ఫోన్ ధర ఇప్పుడు రూ. 30వేల కన్నా తక్కువగా ఉంది. వన్‌ప్లస్ 12ఆర్ కూడా అమ్మకానికి ఉండగా, వన్‌ప్లస్ 11ఆర్ కొనుగోలును పరిగణించవచ్చు.
వన్‌ప్లస్ 12ఆర్ అసలు ధర వద్ద అమెజాన్‌లో జాబితా అయింది. అయితే, ఈ ప్లాట్‌ఫారమ్ కూపన్ రూపంలో రూ. 2వేల ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్‌ను కూడా అందిస్తుంది. వన్‌ప్లస్ 12ఆర్ లిస్టింగ్ పేజీలో కనిపిస్తుంది. కూపన్ బాక్స్‌ను టిక్ చేస్తే సరిపోతుంది. తగ్గిన మొత్తం చెక్అవుట్ పేజీలో కనిపిస్తుంది. ఎలాంటి నిబంధనలు, షరతులు లేకుండా ధర రూ.37,998కి తగ్గుతుంది.
ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై అదనంగా రూ. 2వేల తగ్గింపు ఆఫర్ కూడా ఉంది. ఈ ఫోన్ ధర ప్రభావవంతంగా రూ.35,998కి తగ్గుతుంది. అమెజాన్‌లో ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను పొందాలనుకునే వినియోగదారులు వన్‌ప్లస్ 11ఆర్ కన్నా వన్‌ప్లస్ 12ఆర్ కొనుగోలు చేయొచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు పాత ఫోన్ ధరపై భారీగా తగ్గించే అవకాశం ఉంది. మీరు వన్‌ప్లస్ 11ఆర్ ధరలో 12ఆర్ పొందవచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ మిడ్ రేంజ్ ఫోన్ రూ. 29,998కి విక్రయిస్తోంది. ధర లాంచ్ ధరతో సమానంగా ఉండగా, అమెజాన్ ఈ వన్‌ప్లస్ నార్డ్ ఫోన్‌పై రూ. 2వేలు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఫోన్ ధర రూ.27,998కి తగ్గుతుంది. అదేవిధంగా, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ అసలు రిటైల్ ధర రూ. 19,998 వద్ద అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై ఫ్లాట్ రూ. 2వేల తగ్గింపు కూడా ఉంది. వన్‌ప్లస్ ఫోన్ ధర రూ.17,998కి తగ్గుతుంది.