Diwali 2024 Special Sale : అమెజాన్ దీపావళి స్పెషల్ సేల్.. ఈ ప్రొడక్టులపై బెస్ట్ డీల్స్ మీకోసం.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!
Diwali 2024 Special Sale : ఈ అమెజాన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 29 వరకు కొనసాగుతుంది. ఆసక్తిగల వినియోగదారులు కొనుగోలు చేయడానికి ముందు ఇతర ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లలో ధరలను కూడా ఓసారి పరిశీలించండి.

Amazon Great Indian Festival Diwali Special 2024 Sale
Amazon Great Indian Festival Diwali Special 2024 Sale : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి స్పెషల్ 2024 సేల్ ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ అమెజాన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 29 వరకు కొనసాగుతుంది. ఈ ప్రత్యేక సేల్ సమయంలో ఎయిర్ కండీషనర్లు, వాషింగ్ మెషీన్‌లు, రిఫ్రిజిరేటర్‌లతో సహా అనేక అప్లియన్సెస్, ఇతర ప్రొడక్టులపై తగ్గింపు ధరలకు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లు, ఈఎంఐ లావాదేవీలను ఉపయోగించి చేసిన కొనుగోళ్లకు అమెజాన్ 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది.
ఇతర ఆఫర్‌లలో నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, అమెజాన్ కూపన్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు ఉన్నాయి. మీరు ఈ దీపావళికి కొత్త అప్లియన్సెస్ కోసం షాపింగ్ చేస్తుంటే.. ప్రస్తుత సేల్‌లో మీకు అనేక ఆప్షన్లు ఉన్నాయి. ఎయిర్ ఫ్రైయర్‌లు, రిఫ్రిజిరేటర్‌లు, ఓటీజీల నుంచి మిక్సర్ గ్రైండర్‌ల వరకు కస్టమర్‌లు ఈ ఏడాది గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఫిలిప్స్, ఎల్‌జీ, ప్రెస్టీజ్ వంటి బ్రాండ్‌ల నుంచి ప్రీమియం ఆఫర్‌లపై గణనీయమైన డిస్కౌంట్లను పొందవచ్చు.
అమెజాన్ ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, బీఓబీ, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్‌లతో భాగస్వామ్యం కలిగి ఉంది. వినియోగదారులు బ్యాంకు కార్డ్‌లను ఉపయోగించి చేసే కొనుగోళ్లపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తుంది. కొనుగోలుదారులు అమెజాన్ పే ఆధారిత ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లు, కూపన్ డిస్కౌంట్‌లను కూడా పొందవచ్చు.
క్యాష్ ఆన్ డెలివరీ, ఈజీ రిటర్న్ ఆప్షన్‌లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అమెజాన్‌లో గృహోపకరణాలపై అత్యుత్తమ డీల్స్ అనే టాప్ ఆప్షన్లు ఉన్నాయి. ఆసక్తిగల వినియోగదారులు కొనుగోలు చేయడానికి ముందు ఇతర ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లలో ధరలను కూడా ఓసారి పరిశీలించండి.
- ఎల్‌జీ 9కేజీల ఫుల్ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషర్ డ్రైయర్ (FHD0905SWM) ధర : రూ. 48,990
- ఫిలిప్స్ 750డబ్ల్యూ మిక్సర్ గ్రైండర్ (HL7756/01) ధర : రూ. 2,999
- శాంసంగ్ 385ఎల్, 2 స్టార్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ (RT42C5532S9/HL) ధర : రూ. 43,990
- హిటాచీ 1.5 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ (RAS.G318PCBIBF) ధర : రూ. 37,490
- ఫాబెర్ 60సెం.మీ 1200m3/hr వర్టికల్ వాల్ మౌంటెడ్ చిమ్నీ ధర : రూ. 11,990
- పానాసోనిక్ 27ఎల్ కన్వెక్షన్ మైక్రోవేవ్ ఓవెన్ ధర : రూ. 10,990
- పీజియన్ హెల్త్‌ఫ్రీ డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ ధర : రూ. 2,577
- డ్రీమ్ డీ9 మాక్స్ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్, మాప్ ధర : రూ. 17,999