Amazon Prime Day 2023 : అమెజాన్ ప్రైమ్ డే 2023 సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. నచ్చిన ఫోన్ తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు!
Amazon Prime Day 2023 : అమెజాన్ ప్రైమ్ డే 2023 త్వరలో ప్రారంభం కానుంది. జూలై 15 నుంచి జూలై 16 వరకు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. iPhone 14, Samsung Galaxy M33, iQOO Neo 7 వంటి మరిన్ని స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపులను అందించనుంది.

Amazon Prime Day 2023 _ Get Ready for Eye-Popping Discounts on iPhone 14
Amazon Prime Day 2023 : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) వార్షిక షాపింగ్ ఫెస్టివల్ ప్రైమ్ డేతో మళ్లీ ముందుకు వస్తోంది. భారతీయ అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్ల కోసం జూలై 15 నుంచి జూలై 16, 2023 వరకు రెండు రోజుల వరకు అందుబాటులో ఉంటుంది. స్మార్ట్ ఫోన్ల నుంచి ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్‌లు, గృహోపకరణాల వరకు ఈ సేల్ అనేక ఆకర్షణీయ డీల్స్ అందిస్తుంది. కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నవారికి ఇదే సరైన అవకాశం.. అమెజాన్ ప్రైమ్ డే సేల్ ద్వారా విస్తృత శ్రేణి మోడల్‌లపై 40శాతం వరకు డిస్కౌంట్లను పొందవచ్చు.
ఐఫోన్ 14పై అదిరే డిస్కౌంట్లు :
ఆపిల్ ప్రీమియం ధరలో ఐఫోన్ 14 ఫ్లాగ్‌షిప్ డివైజ్.. ఈ సేల్ సందర్భంగా గణనీయమైన ధరను తగ్గనుంది. కచ్చితమైన తగ్గింపు మిస్టరీగా ఉన్నప్పటికీ.. ప్రస్తుత ధర రూ. 70,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ ఐఫోన్ 14ని ఆపిల్ అభిమానులకు మరింత తక్కువ ధరకు అందించనుంది.
శాంసంగ్ గెలాక్సీ M33 ఫోన్ :
శాంసంగ్ గెలాక్సీ M34 ఫోన్ ధర గెలాక్సీ M33 కన్నా తక్కువ ఉంటుందని భావిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ డే అనేది కొత్త మోడల్ లాంచ్, ప్రైమ్ డే సేల్‌తో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం రూ. 24,499 ఉండగా, సేల్ సందర్భంగా మరింత ధర తగ్గవచ్చునని భావిస్తున్నారు.
ఐక్యూ నియో 7 ఫోన్ :
MediaTek డైమెన్సిటీ 8200 చిప్, 120W ఫాస్ట్ ఛార్జింగ్, 64MP OIS కెమెరాతో ఐక్యూ నియో 7 కూడా భారీ ధర తగ్గింపు పొందే అవకాశం ఉంది. ఈ అండర్‌డాగ్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి రాబోయే అమెజాన్ ప్రైమ్ డే సరైన సమయం కావచ్చు.

Amazon Prime Day 2023 _ Get Ready for Eye-Popping Discounts on iPhone 14
శాంసంగ్ గెలాక్సీ S20 FE ఫోన్ :
స్నాప్‌డ్రాగన్ 865 చిప్, ట్రిపుల్ కెమెరా సెటప్ (12MP + 12MP + 8MP)తో శాంసంగ్ గెలాక్సీ S20 FE ఫోన్ గతంలోనూ ధర తగ్గింది. ప్రస్తుతం అమెజాన్‌లో లిస్టు చేసిన ధర రూ. 74,999 మరింత ఆకర్షణీయంగా ఉంటుందని భావిస్తున్నారు.
ఐక్యూ 11 5G ఫోన్ :
ఐక్యూ 11 5G ఫోన్ పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. టెక్ ఔత్సాహికులకు అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ సేల్ సమయంలో ఐక్యూ 11 5G ఫోన్ ధర భారీ తగ్గింపును పొందవచ్చు.
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఇతర బడ్జెట్ ఫోన్లు (అంచనా) :
* Realme Narzo N53
* Samsung Galaxy M04
* Redmi A2
* iQOO Z6 Lite 5G
* Realme Narzo N55
* Redmi 12C
* Samsung Galaxy M14
* iQOO Z7s 5G
* Realme Narzo 50i
* Redmi Note 12 5G
* Oppo A78 5G
అమెజాన్ ప్రైమ్ డే 2023 సందర్భంగా అనేక బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు, డిస్కౌంట్లను అందించనుంది. ఆసక్తి గల వినియోగదారులు తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లను కలిగిన స్మార్ట్‌ఫోన్లను సొంతం చేసుకోండి.