Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఈ 3 స్కామ్‌లతో తస్మాత్ జాగ్రత్త.. డిస్కౌంట్లు చూసి టెంప్ట్ అయ్యారంటే అంతే..!

Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్ సమయంలో కొనుగోలుదారులు డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే అనేక స్కామ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 స్కామ్‌ల నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఈ 3 స్కామ్‌లతో తస్మాత్ జాగ్రత్త.. డిస్కౌంట్లు చూసి టెంప్ట్ అయ్యారంటే అంతే..!

Amazon Prime Day sale_ Don't fall for these 3 common scams during the July 15 sale

Amazon Prime Day Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) అతిపెద్ద సేల్ ఈవెంట్, ప్రైమ్ డే సేల్, జూలై 15న ప్రారంభం కానుంది. అయితే, సేల్ సమయంలో చాలా మంది సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) కొనుగోలుదారులను మోసగించేందుకు ప్రయత్నిస్తుంటారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో జరిగే 3 అత్యంత సాధారణ మోసాల గురించి చెక్ పాయింట్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ వినియోగదారులను హెచ్చరించింది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సమయంలో కొనుగోలుదారులు తమ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని ప్రొటెక్ట్ చేసుకునేందుకు అనేక స్కామ్‌లపై అవగాహన కలిగి ఉండాలి. ఈ మూడు స్కామ్‌ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఫిషింగ్ ఇమెయిల్స్ : స్కామర్‌లు తరచుగా అమెజాన్ నుంచి వచ్చినట్లు నమ్మిస్తూ.. ఫిషింగ్ ఇమెయిల్‌లను పంపుతారు. రీసివర్ ప్రైమ్ మెంబర్‌షిప్‌లో బిల్లింగ్ సమస్య లేదా వారి ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేయాల్సిన అవసరం వంటి సమస్య ఉందని నమ్మిస్తారు. ఈ ఇమెయిల్‌లు వినియోగదారులు వారి క్రెడిట్ కార్డ్ నంబర్‌లు, అమెజాన్ అకౌంట్ వివరాలు లేదా ఇతర సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేస్తారు. ఫిషింగ్ స్కామ్‌ల బారిన పడకుండా ఉండేందుకు అనువానిత ఇమెయిల్‌ల పట్ల జాగ్రత్తగా ఉండటం, ఇమెయిల్ పంపినవారి అడ్రస్‌కు ఒకటికి రెండుసార్లు చెక్ చేయడం, అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయకుండా ఉండటం చాలా ముఖ్యమని గుర్తించాలి.

Read Also : Reliance Jio Plans : రిలయన్స్ జియో 2 కొత్త రీఛార్జ్ ప్లాన్లు ఇవే.. 5G డేటా బెనిఫిట్స్ మీకోసం.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

ఫేక్ అమెజాన్ సంబంధిత డొమైన్‌లు : సైబర్‌ సెక్యూరిటీ సంస్థ చెక్ పాయింట్ 1,500 కొత్త అమెజాన్ సంబంధిత డొమైన్‌లను కనుగొంది. అందులో చాలా హానికరమైనవి లేదా మోసపూరితమైనవి ఎక్కువగా ఉన్నాయి. వినియోగదారులు సురక్షితమైన అమెజాన్ వెబ్‌సైట్‌లను విజిట్ చేస్తున్నారనిఅనిపించేలా ఈ డొమైన్‌లను క్రియేట్ చేస్తారు. వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని అందించడానికి యూజర్లను మోసగించడానికి తరచుగా అధికారిక అమెజాన్ సైట్ మాదిరిగా ఉండేలా సెట్ చేస్తారు. అమెజాన్ యూజర్లు అడ్రస్ బార్‌లోని URL చెక్ చేయడం ద్వారా తెలియని డొమైన్‌ల పట్ల జాగ్రత్తగా ఉండవచ్చు. తద్వారా మీరు అమెజాన్ అధికారిక వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేస్తున్నారని నిర్ధారించుకోండి.

Amazon Prime Day sale_ Don't fall for these 3 common scams during the July 15 sale

Amazon Prime Day sale_ Don’t fall for these 3 common scams during the July 15 sale

– స్కామ్ ఇమెయిల్స్, టెక్స్ట్ మెసేజ్‌లు షిప్పింగ్ నోటిఫికేషన్‌లు, ఆర్డర్ కన్ఫర్మేషన్లు లేదా అకౌంట్సమస్యలను పోలి ఉండే స్కామ్ ఇమెయిల్‌లు, టెక్స్ట్ మెసేజ్‌ల గురించి అమెజాన్ స్వయంగా హెచ్చరించింది. హానికరమైన లింక్‌లపై క్లిక్ చేయడం లేదా సున్నితమైన సమాచారాన్ని అందించడం ద్వారా వినియోగదారులను మోసగించడం ఈ మెసేజ్‌ల లక్ష్యమని గమనించాలి. గుర్తు తెలియని మెసేజ్‌ల పట్ల సందేహాస్పదంగా ఉండటం, అమెజాన్ అధికారిక ఛానెల్‌ల ద్వారా కమ్యూనికేషన్ చట్టబద్ధతను ధృవీకరించడం, అనుమానిత మెసేజ్‌ల ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయరాదు. అమెజాన్ ప్రైమ్ డే లేదా ఏదైనా ఆన్‌లైన్ షాపింగ్ ఈవెంట్ సమయంలో కొనుగోలుదారులు జాగ్రత్తగా ఉండటం, అప్రమత్తంగా ఉండటం, ఈ బెస్ట్ ఎక్సరసైజెస్ ఫాలో కావడం చాలా ముఖ్యం.

– అనుమానిత ఇమెయిల్‌లు, మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండండి.
– చట్టబద్ధతకు ఇమెయిల్ పంపినవారు వెబ్‌సైట్ URLలను ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి.
– అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోండి.
-అధికారిక ఛానెల్‌ల ద్వారా డేటాను ధృవీకరించండి. అనుమానం ఉంటే కస్టమర్ సపోర్టును సంప్రదించండి.
– మీ అమెజాన్ అకౌంట్ కోసం బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి.
– మీ అకౌంట్ సేఫ్‌గా ఉంచడానికి టూ-ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ ప్రారంభించడం ముఖ్యం. ఏదైనా అనుమానాస్పద కార్యాచరణకు మీ ఆర్థిక నివేదికలు, అకౌంట్లను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి.

సురక్షితమైన ఆన్‌లైన్ ద్వారా మీరు (Amazon Prime Day) లేదా ఏదైనా ఇతర ఆన్‌లైన్ షాపింగ్ ఈవెంట్ సమయంలో మోసాలకు గురయ్యే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

Read Also : Samsung Galaxy S21 FE 5G : శాంసంగ్ గెలాక్సీ S21 FE 5G ఫోన్ ఇదిగో.. కొత్త వేరియంట్‌ ఫీచర్లు తెలిస్తే కొనకుండా ఉండలేరు..!