Amazon Sale Offers : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. స్మార్ట్ ఫోన్లపై 40శాతం ఆఫర్.. 4 రోజులు మాత్రమే!

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 17నుంచి ప్రారంభం కానుంది. నాలుగు రోజులు పాటు ఈ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అందుబాటులో ఉండనుంది.

Amazon Sale Offers : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. స్మార్ట్ ఫోన్లపై 40శాతం ఆఫర్.. 4 రోజులు మాత్రమే!

Amazon Sale Offers Amazon Great Republic Day Sale Get 40% Off On Smart Phones (1)

Updated On : January 12, 2022 / 5:40 PM IST

Amazon Sale Offers : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 17నుంచి ప్రారంభం కానుంది. నాలుగు రోజులు పాటు ఈ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అందుబాటులో ఉండనుంది. ఈ అమెజాన్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై 40 శాతం ఆఫర్ పొందవచ్చు. అయితే అమెజాన్ ప్రైమ్ యూజర్లు మాత్రం నాలుగు రోజుల పిరియడ్ కంటే ముందు రోజు నుంచే సేల్ ఆఫర్ యాక్సస్ చేసుకోవచ్చు. అంటే.. జనవరి 16 , 12:00AM ముందస్తుగా యాక్సస్ చేసుకోవచ్చు. Amazonలో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 20న ముగుస్తుంది.

Amazon గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఇంగ్లీష్‌తో పాటు మరాఠీ, హిందీ, మరాఠీ, బెంగాలీ, కన్నడ, తెలుగు, తమిళం మలయాళంతో సహా 8 ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉంటుంది. అమెజాన్ వినియోగదారులు తమ భాషలో వాయిస్ ద్వారా షాపింగ్ చేసుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా పొందవచ్చు. గరిష్టంగా రూ.16వేల వరకు పొందవచ్చు. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, యాక్ససరీస్, హోం అప్లయన్సెస్, రోజువారీ హోం యాక్ససరీస్ కొనుగోలుపై డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లను అమెజాన్ అందిస్తోంది. Apple, Samsung, Xiaomi, OnePlus, Realme, iQOO వంటి స్మార్ట్‌ఫోన్ కంపెనీలు అమెజాన్‌లో తమ ఫోన్లపై ఆఫర్లను అందిస్తున్నాయి. సేల్ పీరియడ్ ఉచిత హోమ్ డెలివరీ,

డెలివరీపై పేమెంట్ (COD), SBI క్రెడిట్ కార్డ్‌పై ఇన్ స్టంట్ 10 శాతం డిస్కౌంట్ అందిస్తుంది. SBIతో పాటు, ఇతర ఫైనాన్సస్ సర్వీసెస్ అయిన ICICI బ్యాంక్ కార్డ్‌లు, బజాజ్ ఫిన్‌సర్వ్ ఆకర్షణీయమైన ఆఫర్‌లు, క్యాష్‌బ్యాక్‌లను అందిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌లు సేల్ పీరియడ్‌లో 24 గంటల ముందుగానే యాక్సెస్ పొందే అవకాశం కల్పిస్తోంది.

స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులు Xiaomi, OnePlus, Samsung, Apple iQOO నుంచి స్మార్ట్‌ఫోన్‌లపై దాదాపు 40 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఇక స్మార్ట్ టీవీలు 60 శాతం డిస్కౌంట్‌తో సొంతం చేసుకోవచ్చు. స్మార్ట్ టీవీ బ్రాండ్‌లలో OnePlus, Samsung, Sony Xiaomi గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో అందుబాటులో ఉండనున్నాయి. ఎలక్ట్రానిక్స్ యాక్ససరీస్‌పై దాదాపు 70 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఇతర ప్రొడక్టులపై 50 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.

Read Also : Microsoft Tab: భారత్ లో Surface Pro X ను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్