Amazon Great Republic Day Sale : త్వరలో అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌.. ఆపిల్ ఐఫోన్ 13, వన్‌‌ప్లస్ 11 ఫోన్లపై భారీ డీల్స్..!

Amazon Great Republic Day Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఆపిల్ ఐఫోన్ 13, వన్‌ప్లస్ 11 వంటి స్మార్ట్‌ఫోన్‌లు భారీ తగ్గింపు పొందే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Amazon Great Republic Day Sale : త్వరలో అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌.. ఆపిల్ ఐఫోన్ 13, వన్‌‌ప్లస్ 11 ఫోన్లపై భారీ డీల్స్..!

Amazon teases Great Republic Day sale

Amazon Great Republic Day Sale : 2024 కొత్త సంవత్సరంలో వివిధ ఇ-కామర్స్ దిగ్గజాలు అనేక అద్భుతమైన ఆఫర్‌లను అందిస్తున్నాయి. గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్నందున వివిధ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారాలు మీకు ఇష్టమైన గాడ్జెట్‌లను ఆకట్టుకునే ధరలకు అందించడానికి ప్లాన్ చేస్తున్నాయి. అమెజాన్ రిపబ్లిక్ డే సేల్‌ను త్వరలో ప్రారంభించనుంది. ఈ సేల్‌లో భాగంగా ఆపిల్ ఐఫోన్ 13, వన్‌ప్లస్ 11 సహా వివిధ స్మార్ట్‌ఫోన్‌లపై తగ్గింపు పొందవచ్చు. ఈ డీల్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ త్వరలో ప్రారంభం :
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2024 త్వరలో ప్రారంభం కానుంది. అమెజాన్ వెబ్‌సైట్‌లో వివరాలను షేర్ చేసింది. అయితే, విక్రయానికి సంబంధించిన కచ్చితమైన తేదీలు ఇంకా తెలియరాలేదు. గత ఏడాదిలో సేల్ జనవరి 15న ప్రారంభమైంది. ఈ ఏడాది కూడా అదే సమయంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మీరు అమెజాన్ ప్రైమ్‌ని కలిగి ఉంటే.. సేల్‌కు ముందస్తు యాక్సెస్‌ను పొందవచ్చు. గణతంత్ర దినోత్సవం దగ్గరపడుతున్న కొద్దీ మరిన్ని విషయాలు వెల్లడించనుంది.

Read Also : Flipkart Republic Day Sale : ఈ నెల 14 నుంచే ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్.. ఐఫోన్ 15, పిక్సెల్ 8 ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో ఆఫర్లు..!

అమెజాన్ సేల్ సమయంలో ఆపిల్ ఐఫోన్ 13 నుంచి వన్‌ప్లస్ 11 వరకు చాలా స్మార్ట్‌ఫోన్‌లు తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం రూ.59,900కు విక్రయిస్తున్న ఐఫోన్ 13 ప్రత్యేక తగ్గింపుతో లభ్యం కానుంది. మరోవైపు, వన్‌ప్లస్ 11 ధర ప్రస్తుతం రూ. 56,999కు పొందవచ్చు. ఈ సేల్ సమయంలో ఈ ఫోన్ ప్రత్యేక తగ్గింపుతో కూడా అందుబాటులో ఉంటుంది.

Amazon teases Great Republic Day sale

Amazon teases Great Republic Day sale

అందులో వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 లైట్, రెడ్‌మి 12 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 5జీ, ఐక్యూ జెడ్7 ప్రో 5జీ, వన్‌ప్లస్ 11ఆర్, హానర్ 90 5జీ వంటి ఫోన్‌లపై మరిన్ని డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సేల్ సమయంలో కవర్లు, ఛార్జర్లు, పవర్ బ్యాంక్‌లు, హెడ్‌సెట్‌లు, మొబైల్ ప్రొజెక్టర్‌లతో సహా స్మార్ట్‌ఫోన్ అప్లియన్సెస్ కూడా ప్రత్యేక ధరలకు అందుబాటులో ఉంటాయి. ఈ తగ్గింపులు కాకుండా మీకు ఇష్టమైన గాడ్జెట్‌ల ధరలను మరింత తగ్గించడానికి ఇతర మార్గాలు ఉన్నాయి.

బ్యాంకు ఆఫర్లపై 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ : 
ఉదాహరణకు, మీకు ఎస్‌బీఐలో బ్యాంక్ అకౌంట్ ఉంటే.. మీ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించినప్పుడు లేదా ఈఎంఐల ద్వారా చెల్లించినప్పుడు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. మీరు సేల్ సమయంలో కొనుగోలు చేసే కొత్త ఫోన్ తక్కువ ధరను పొందాలంటే.. మీ పాత డివైజ్ కూడా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.

అయితే, డిస్కౌంట్ విలువ డివైజ్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి. మీ పాత డివైజ్ మెరుగైన కండిషన్‌లో ఉంటే.. మరింత తగ్గింపు పొందవచ్చు. మీ కొత్త గాడ్జెట్ చౌకైన ధరకే పొందవచ్చు. ఫోన్‌లు మాత్రమే కాకుండా, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు వంటి ఇతర గాడ్జెట్‌లపై 75 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.

Read Also : Oppo Find X7 Series Launch : ఒప్పో ఫైండ్ ఎక్స్7 సిరీస్ చూశారా? అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతో తెలుసా?