వైరల్‌గా మారిన ఆనంద్ మహీంద్ర వీల్ ఛైర్ ట్వీట్

వైరల్‌గా మారిన ఆనంద్ మహీంద్ర వీల్ ఛైర్ ట్వీట్

Updated On : October 25, 2019 / 9:42 AM IST

భారత వ్యాపారవేత్తలలో అగ్రస్థాయిలో ఉన్న ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్ గా ఉంటారు. ఆయన చేసే ట్వీట్లు ఆలోచింపజేసేలా ఉంటాయనడంలో సందేహం లేదు. కొత్త ఆలోచనలు జీవితాన్ని కాపాడతాయంటూ మరో ట్వీట్‌ను శుక్రవారం ఉదయం పోస్టు చేశారు. ఇందులో చైనా తెలివితేటలను మెచ్చుకుంటూ తనకే ఔరా అనిపించేలా ఉందని  అన్నారు. 

‘చూడబోతే ఇది చైనాకు చెందినదిలా కనిపిస్తోంది. 3బిలియన్ల మంది ప్రజలు మధ్యలో ఉన్నాం. ప్రయోగాలు ఉపయోగపడేలా ఉంటే రెండు దేశాలు లాభపడతాయి. టెక్నాలజీ అద్భుతమైన పరికరాలు తయారయ్యేందుకు సాయపడుతుంది. దాంతో పాటు జీవితాన్ని సులువుగా, వృద్ధులకు సహకరించేవిగా ఉంటే ఇంకా బాగుంటుంది’ అని ట్వీట్ చేశారు. 

ఈ ట్వీట్‌లో ఓ మహిళ వీల్ చైర్ సాయంతో లేవలేని స్థితిలో ఉన్న వ్యక్తిని చాలా ఈజీగా కూర్చొబెట్టి వేరే చోటికి తీసుకెళుతుంది. దీని ప్రత్యేకత ఏంటంటే సీట్ కూడా ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత వ్యక్తిని కూర్చొన్న చోటు నుంచి వేరే చోటుకి సులువుగా దించేయొచ్చు. డైలీ యాక్టివిటీస్ అంతే సులువైన పద్ధతిలో పూర్తి చేయొచ్చు.